NewsOrbit
జాతీయం న్యూస్

Amith Shah: సరిహద్దు భద్రతా వ్యవస్థపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amith Shah: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం దక్కిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రుస్తాంజీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు భద్రతా దళ సిబ్బంది, అధికారులతో మాట్లాడిన అమిత్ షా..పలువురు సైనికులు, సరిహద్దుల్లో వీర మరణం పొందిన జవాన్లకు గ్యాలంట్రీ మెడల్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah key comments
Amit Shah key comments

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే వరకూ ఈ దేశానికి భద్రతా విధానం ఉందా అంటే సందేహమేనన్నారు. అప్పటి వరకూ మనకు స్వతంత్ర భద్రతా విధానం లేదన్నారు. మోడీ వచ్చిన తరువాత దేశానికి స్వతంత్ర భద్రతా పాలసీ వచ్చిందన్నారు. అందరితో శాంతియుత సంబంధాలు కలిగి ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన అని కానీ ఎవరైనా మన సరిహద్దులను మార్చే ప్రయత్నం చేస్తే మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే అదే స్థాయిలో సమాధానమివ్వటమే మన భధ్రతా విధాన లక్ష్యమని అన్నారు. స్వతంత్ర భద్రతా విధానం లేకుండా దేశం అభివృద్ధి చెందదనీ అలాగే ప్రజాస్వామ్యం విరాజిల్లదనీ, దానిని మోడీ సాధించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం మూడు శాతం మేర కంచె లేకుండా ఉన్న సరిహద్దులు చొరబాటు దారులకు అనుకూలంగా మారుతున్నాయనీ, వచ్చే ఏడాది నాటికి దేశ సరిహద్దులను కంచెతో మూసివేస్తామని షా స్పష్టం చేశారు. జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన 20 రోజుల తరువాత అమిత్ షా ఈ విషయంపై స్పందించారు. స్వదేశీ యాండీ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతమని అన్నారు. ఆ దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కృత్రిమ మేథ వినియోగించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు సిద్ధంగా ఉండాలనీ. ఉగ్రవాదులు, స్మగ్లర్లు సృష్టించే సమస్యలకు పరిష్కారానికి నిపుణులతో భాగస్వామ్యమై పని చేయాలని పిలుపునిచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju