వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం సంపాదించడానికి విపక్షాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. మరోపక్క మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు పలు హామీలు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని దించాలని విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగా దేశంలో పేరుగాంచిన పలు జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఇంకా మమతా బెనర్జీ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీలు ఇలా దాదాపు 30 పార్టీలు.. ఇండియా అనే కోట మీద ఏర్పడటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే దేశం మొత్తం ముందస్తు ఎన్నికలు జరిపించే యోచనలో మోడీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దేశంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోవలసిన అవసరం లేదని ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు దేశంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ప్రత్యేక హెలికాప్టర్ లు కూడా సిద్ధం చేసినట్లు ఆమె వ్యాఖ్యానించారు. అయితే దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విపక్ష కూటమి కచ్చితంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఈసారి కేంద్రంలో అధికారం మారడం తద్యమని వ్యాఖ్యానించారు. దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్నాయి. ఇవి లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ అని భావించవచ్చు.
ఈ ఎన్నికలలో కనుక బీజేపీ పరాజయం పాలైతే ఆ ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. ఈ క్రమంలో విపక్ష కూటమి గెలుపు తద్యమవుతుంది. అయితే ఇప్పుడు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని సర్వేలు వస్తూ ఉన్నాయట. దీంతో దీని ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికల మీద పడకుండా మోడీ దేశం మొత్తం ఒకేసారి ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్లాన్ వేసినట్లు ఈ రకంగా బిజెపిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.