NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Assembly Election Results 2023: నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు .. ఫలితాలపై ఉత్కంఠ

Assembly Election Results 2023: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొద్ది సేపటి క్రితం (ఉదయం 8 గంటలకు) మొదలైంది. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు మిజోరం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినప్పటికీ షెడ్యూల్ తేదీకి ఒక రోజు తర్వాత డిసెంబర్ 4 (రేపు)న కౌంటింగ్ జరగనుంది. అయిదు రాష్ట్రాల పోలింగ్ నవంబర్ 7న మొదలై 30తో ముగిసింది. చత్తీస్ గఢ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ ఒకే విడతలో జరిగింది. చత్తీస్ గఢ్ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి.

రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. ఒక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి హఠాన్మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. గత మూడు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఒక సారి బీజేపీ, మరో సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తొంది. చత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ నవంబర్ 7న 20 స్థానాలకు జరగ్గా, మిగిలిన 70 స్థానాలకు 17న పోలింగ్ జరిగింది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉందై. అప్, బీఎస్పీ సహా పలు ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో 230 స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ భారీ భద్రతా ఏర్పట్ల మధ్య మొదలైంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంది.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్‌  ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తం మొత్తం లక్షా 80 వేల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్ సిద్ధం చేశారు అధికారులు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా.. 2,32,59,256 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10.30కు తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో ఉండగా, 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, ఒక స్థానంలో సీపీఐ, 111 నియోజకవర్గాల్లో బీజేపీ, 8 స్థానాల్లో జనసేన, 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. అత్యథికంగా జూబ్లీహిల్స్‌లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుండగా.. అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది.

KTR: గన్ గురి పెట్టిన కేటిఆర్ ..వేడుకలకు సిద్దంగా ఉండండి

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju