NewsOrbit
జాతీయం న్యూస్

Assembly Elections 2021 : మోగిన ఎన్నికల నగారా

Assembly Elections 2021 : దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. పశ్చిమ బెంగాల్, కేరళతో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అరోరా మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్దమవుతున్నామని పేర్కొన్నారు. నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్ఛేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 18,68కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా వెల్లడించారు.

Assembly Elections 2021 ec announces poll days for 4 states and ut
Assembly Elections 2021 ec announces poll days for 4 states and ut

అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇసీ తెలిపింది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ ల దాఖలు గడువు మార్చి 9వ తేదీ. 10న నామినేషన్ల పరిశీలన, మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న అసోంలో ఎన్నికలు. మే 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.

కేరళ, తమిళనాడు, పాండిఛ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో పోలింగ్ కు షెడ్యుల్ ప్రకటించింది. మార్చి 27,ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరగనున్నది. కాగా వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలకు వేరే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇసి తెలిపింది.

ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసి చర్చించింది. ఎన్నికల సన్నద్ధత, శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఈసీ అధికారులతో సమీక్ష జరిపింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju