ఉత్తరప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్యకు గురైయ్యాడు. జైలు నుండి వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్ ను పోలీసులు శనివారం ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతీక్ అహ్మద్ తో పాటు ఆయన సోదురడు అఫ్రాఫ్ అహ్మద్ కూడా హతమయ్యారు. ఇటీవలే (గురువారం) అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అతని అంత్యక్రియలు ముగిసిన ముగిసిన రోజునే అతిక్ అహ్మద్, అఫ్రాఫ్ అహ్మద్ పై కాల్పులు చోటుచేసుకోవడం, వారు ఇద్దరు హతమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తులో వీరు ఆసుపత్రికి వెళుతుండగా ముగ్గురు దుండగులు వారి సమీపంలోకి వచ్చి మరీ పాయింట్ బ్లాంక్ రేజ్ లో పిస్టల్ తో పలు రౌండ్ లు కాల్పులు జరిపారు. దీంతో అతీక్ అహ్మద్, అఫ్రాఫ్ అహ్మద్ లు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. పోలీసుల సమక్షంలోనే నిందితులు వారిపై కాల్పులకు తెగబడటం తీవ్ర సంచలనం అయ్యింది. ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై హంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాన్ సింగ్ అనే కానిస్టేబుల్ కు బుల్లెట్ గాయాలయ్యారు. ఆ కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కు ప్రాణాపాయం తప్పిందని వైదులు నిర్దారించినట్లుగా తెలుస్తొంది.
రీసెంట్ గా అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ తో పాటు అతని సన్నిహితుడు గులామ్ లు పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఘటన నేపథ్యంల ఉత్తరప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటి ప్రకంపనల తీవ్రత తగ్గుకముందే ఇప్పుడు ఏకంగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అయితే అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిపై కాల్పులకు తెగబడి వారిని హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.
దుండగుల కాల్పుల్లో హతమైన అతీక్ అహ్మద్ ఒక సారి పార్లమెంట్ సభ్యుడుగా, అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుండి అతీక్ అహ్మద్ జైలులోనే ఉన్నాడు. ఆయనకపై వందకు పైగా కేసులు ఉన్నట్లుగా సమాచారం.
Pawan Kalyan విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వెనకడుగు.. పవన్ సంచలన పోస్ట్..!!