NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట

Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఊరట లభించింది. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ బెయిల్ పొడిగించింది. తనపై దిగువ కోర్టు ఇచ్చన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కింది కోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్ చేసిన అభ్యర్ధనపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

Rahul Gandhi

2019 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాందీ ప్రధాని మోడీ ఇంటి పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గానీ ఇటీవల ఆయనకు సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై ఇవేళ ఆయన గుజరాత్ లోని సూరత్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంకా గాంధీ వెంట రాగా, ఆయన సూరత్ సెషన్స్ కోర్టుకు హజరైయ్యారు. భారీ భద్రత నడుమ ఆక్కడకు చేరుకున్నారు. తన జైలు శిక్ష తీర్పును సవాల్ చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసిన ఆయన మరో రెండు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్ష ను సస్పెండ్ చేయాలని అందులో కోరారు. అయితే అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడించింది. అలాగే పరువు నష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 13న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఆ విచారణకు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది.

రాహుల్ గాంధీకి ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయన లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. కాగా.. కోర్టు అప్పీల్ చేసేందుకు వెళ్లిన రాహుల్ వెంట భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడాన్ని బీజేపీ తప్పుబట్టింది.

YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!