Bandaru Dattatreya: హరియాణా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన దత్తాత్రేయ

Share

Bandaru Dattatreya: హరియాణా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి గురువారం ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.

Bandaru Dattatreya takes oath as haryana governor
Bandaru Dattatreya takes oath as haryana governor

ఇటీవల కాలం వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం ఇటీవల హరియాణాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతితక్కువ మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే హజరయ్యారు. హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా 1980లో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన దత్తాత్రేయ పలు మార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైయ్యారు. ఇటీవల కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. ఈ క్రమంలో బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుండి చండీగడ్ కు బదిలీ చేసింది కేంద్రం.


Share

Related posts

ఆచార్య విషయంలో కొరటాల ప్లాన్ ఇదే అయితే బాహుబలి ని మించిపోవడం ఖాయం..?

GRK

సీతగా ఆ హీరోయిన్ అంటే దేశం మొత్తం నో చెప్తుంది.. ప్రభాస్ ఏమంటాడో ..?

GRK

ఉన్నపళంగా తన సేన మొత్తాన్ని అప్రమత్తం చేసిన చంద్రబాబు..!!

sekhar