29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

ఆదానీ గ్రూప్ పేరు ప్రస్తావించకుండానే.. భారత బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ కీలక ప్రకటన

Share

గౌతమ్ ఆదానీ సంస్థల్లో ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్  నివేదిక వెల్లడించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ లో తీవ్ర అలజడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం  భారత బ్యాకింగ్ రంగంపై కూడా పడుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. ఆదానీ గ్రుప్ పేరు ప్రస్తావించకుండానే దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆర్ధిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ సెక్టార్ పై, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్ బీ ఐ నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొంది.

banking sector remains resilient stable - RBI
banking sector remains resilient stable 8211 RBI

 

“ఒక వ్యాపార సంస్థ కు సంబంధించి విషయంలో భారతీయ బ్యాంకుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు ఉన్నాయి. బ్యాంకుల రెగ్యులేటర్, సూపర్ వైజర్ గా ఆర్ధిక స్థిరత్వాన్ని కొనసాగించే ఉద్దేశ్యంతో బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్ బీ ఐ నిఘా ఉంచుతుంది. ఆర్ బీ ఐ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ లార్జ్ క్రిడిట్స్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. ఇది బ్యాంకులు రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ లావాదేవీలను నివేదిస్తాయి. ఇది పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఆర్ బీ ఐ ప్రస్తుత అంచనా ప్రకారం, బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉంది. మూల ధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. బ్యాంకులు కూడా ఆర్ బీ ఐ జారీ చేసిన లార్జ్ ఎక్స్ పోజర్ ఫ్రేమ్ వర్క్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. ఆర్ బీఐ అప్రమత్తంగా ఉంటూ భారతీయ బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంది” అని ఆర్ బీ ఐ తన ప్రకటనలో పేర్కొన్నది.

Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు.. ఎందుకంటే..?


Share

Related posts

మూడు సినిమాలకి వెయ్యి కోట్లు .. ప్రభాస్ పేరు చెప్తే వణుకుతున్న బాలీవుడ్ హీరోలు !

GRK

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై…

somaraju sharma

పండుగ సీజన్‌లో ఆఫ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్న ఎస్‌బీఐ !

Teja