బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీపై వేటువేసిన దీదీ.. అర్పితా ముఖర్జీ స్టేట్‌మెంట్‌తో చటర్జీకి బిగుసుకుంటున్న ఉచ్చు..?

Share

ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటు వేశారు. మంత్రి చటర్జీని బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాణిజ్య, ఐటీ శాఖ బాధ్యతలను ఇకపై తాను చేపడతానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయనీ, వాటి వివరాల్లోకి ప్రస్తుతం వెళ్లబోనని మమతా బెనర్జీ తెలిపారు. మమతా బెనర్జీ ప్రకటనకు ముందు మంత్రి పార్ధా చటర్జీని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మజుందార్ .. టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

 

అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన అయిదు రోజుల తరువాత మంత్రి చటర్జీపై వేటు పడింది. ఈ నెల 23వ తేదీన కోల్‌కతాలో మంత్రి చటర్జీ  సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసం నుండి ఈడీ అధికారులు రూ.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పార్ధా చటర్జీ, అర్పితా ముఖర్జీలను అరెస్టు చేసిన ఈడీ అధికారులు అర్పిత నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో బుధవారం నాడు అర్పితకు చెందిన రెండవ ఫ్లాట్ లో మరో 29 కోట్ల నగదు, అయిదు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా దర్యాప్తునకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. ఈ సమయంలో మంత్రి పార్ధ చటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తొంది. రాజ్ దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అర్బితా ముఖర్జీ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న నగలు, నగదు, కీలక డాక్యుమెంట్లను పది ట్రంక్ పెట్టెల్లో ఉంచి డీసీఎం వ్యాన్ లో తరలించారు ఈడీ అధికారులు. తన ఇంట్లో లభించిన ఆ డబ్బు అంతా మంత్రి చటర్జీదేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారుల వద్ద ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్పితా ముఖర్జీ స్టేట్ మెంట్ తో చటర్జీకి ఉచ్చు బిగుసుకుంటోంది.

 

ఈ ఉదయమే మంత్రి చటర్జీ వ్యవహారంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే చటర్జీని మంత్రివర్గం నుండి, పార్టీ పదవుల నుండి, టీఎంసీ నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే తనను అన్ని పదవుల నుండి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు కునాల్ ఘోష్. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్విట్ చేశారు. ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో పాటు స్వపక్షంలోని నేతలు కూడా చటర్జీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తొంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

5 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

13 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago