NewsOrbit
జాతీయం

పాటల్లో దేశభక్తి స్ఫూర్తి.. ఈ పాటలు ఎవర్‌గ్రీన్!

Best Patriotic Songs to play for this Republic Day 2023

Patriotic Songs For Republic Day 2023: తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భారతదేశం విముక్తి పొంది దాదాపు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రపంచ దేశాలకు ధీటుగా పరిపాలన కొనసాగిస్తోంది. జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. గణతంత్ర దినోత్సవానికి ఇంకా రెండు రోజు మాత్రమే మిగిలిఉంది. దాంతో ఇప్పటికే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ సన్నాహాలు జోరుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ప్రత్యేకంగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Republic Day Patriotic Songs
Republic Day Patriotic Songs Best Patriotic Songs to play for this Republic Day 2023

Happy Republic Day 2023: వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి బెస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇవి

స్వాతంత్ర్యోద్యమ పోరాట విశిష్టత, దేశభక్తి, అమరవీరుల త్యాగాలు, సైనికుల వీరత్వాన్ని వివరించే దేశభక్తి గీతాలు అన్ని సినీ ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి నేటి యంగ్ స్టార్ హీరోల వరకు దేశభక్తి కలిగిన సినిమాలు, సాంగ్స్ లో నటించడం జరిగింది. యువతలో స్వాతంత్ర్యోదమ స్ఫూర్తిని నింపేందుకు ఈ పాటలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని రగిలిస్తుంటాయి. అలాంటి టాప్ 10 దేశభక్తి పాటల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

‘పాడవోయి భారతీయుడా..’
‘పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా’ అంటూ శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ఇది. ప్రతి ఏడాది స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ పాట మార్మోగుతూ ఉంటుంది. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘వెలుగు నీడలు’ అనే సినిమాలోనిది. ఈ పాటకు పి.సుశీల, ఘంటసాల స్వరాన్ని అందించారు.

‘భారత మాతకు జేజేలు’..
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘బడిపంతులు’. ఈ సినిమాలోని ఓ పాట దేశభక్తిని చాటుతుంది. ‘భారతమాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు..’ ఈ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది. ఆచార్య ఆత్రేయ రచించిన ఈ దేశభక్తి గీతాన్ని ఘంటసాల స్వరాన్ని అందించారు.

‘గాంధీ పుట్టిన దేశం’..
‘గాంధీ పుట్టిన దేశం’ సినిమాలోని ‘గాంధీ పుట్టిన దేశం.. రఘు రాముడు ఏలిన రాజ్యం..’ అనే పాట భారత దేశ విశిష్టతను గుర్తు చేస్తుంది. ఈ పాటను మ్యాలవరపు గోపి చంద్ రాశారు. ఎస్‌పీ కోదండపాణి సంగీతం, పి.సుశీల గాత్రం అందించారు.

‘తెలుగు వీర లేవరా’..
విప్లవ కిరణం ‘అల్లూరి సీతారామరాజు’ వీరత్వాన్ని తెలిపే గీతం ‘తెలుగు వీర లేవరా.. దీక్షపూని సాగరా..’. ఈ పాటను వింటే ప్రతి తెలుగోడి దేశభక్తి ఉప్పొంగుతుంది. తెల్లదొరను తరిమి కొట్టిన సీతారామరాజు పౌరుషాన్ని చూపుతుంది.

‘పుణ్యభూమి నా దేశం’..
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఈ సినిమాలోని దేశభక్తి పాటే ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి.. ధన్యభూమి నా దేశం సదాస్మరామి..’ ఈ పాట దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలను గుర్తు చేస్తుంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు.

‘మేమే ఇండియన్స్’..
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే రన్‌ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.

అలాగే ‘రోజా’ సినిమాలోని ‘వినరా వినరా దేశం మనదేరా’, ప్రముఖ సంగీత విధ్వాంసుడు రెహమాన్ పాడిన ‘మా తుజే సలాం’, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ చిత్రంలోని ‘ఐయామ్ ఇండియన్’. బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్ హీరోగా నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని ‘ఏ జో దేశ్ హే తేరా’, ‘ఏ వతన్’ సినిమాలోని ‘ఏ వతన్ అదాబ్ రహే తు’, ఏబీసీడీ-2 సినిమాలోని ‘వందేమాతరం’ వంటి పాటలు నేటి యువతలో దేశభక్తిని పెంపొందించి, స్వాతంత్ర్య, గణతంత్ర్యోదమ స్ఫూర్తిని నింపుతున్నాయి.

Related Story: వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి బెస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇవి

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

sharma somaraju

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలన మొదలెట్టేసినట్లున్నారు(గా)..!

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

sharma somaraju

Big Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ

sharma somaraju

Big Breaking: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు .. ఢిల్లీలో టెన్షన్ .. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ..?

sharma somaraju

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

sharma somaraju