NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

BJP : బీజేపీ మెడకు పెట్రో, గ్యాస్ బండ!

BJP: పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు బిజెపికి చుట్టుకుంటోంది. మెల్లగా అది పార్టీ ప్రతిష్ట మీద, ప్రభుత్వ నిర్వాకం మీద మధ్యతరగతి ప్రజల్లో అసహనానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదల మీద ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తూ ఉంటే వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు బీజేపీ ప్రభుత్వానికి పూర్తి టెన్షన్ తెప్పిస్తున్నాయి. 2022 లోనే జమిలి ఎన్నికలకు వెళ్లి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపించే ఆలోచనలో ఉన్న మోడీ సర్కార్ కు ఇప్పుడు ఈ మధ్య తరగతి వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత తో ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది.

 

నేపాల్ కంటే ఎక్కువగా

భారతదేశం నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపాల్ కంటే భారతదేశంలో పెట్రోల్ ధరలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టాయి. ఫిబ్రవరి లో ఏకంగా పదహారు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే, ఒక్క ఫిబ్రవరి నెలలోనే గ్యాస్ ధర వంద రూపాయల మేర పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనంతగా ఉందని సగటు మధ్యతరగతి వారు గగ్గోలు పెడుతున్నారు. మోడీ ప్రభుత్వం చేతగానితనం గానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అంతా కేంద్రం పైనే భారం వేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను కొద్దిమేర తగ్గించినప్పటికీ అది ఏమాత్రం వాహనదారులకు ఊరట లభించలేదు. పెట్రోల్ ధర దాదాపు లెటర్ వంద రూపాయల వరకు వచ్చేస్తే గ్యాస్ పర సైతం వెయ్యి రూపాయలకు దగ్గరగా ఉంది. పెట్రోల్ గ్యాస్ నియంత్రణ మొత్తం కేంద్రం పరిధిలోనే ఉండే అంశంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ చేతులు జరుపుకోవాలని చూస్తున్నాయి. దీంతో మొత్తం భారం బీజేపీ మీద పడుతుంది. కేంద్ర బిజెపి ప్రభుత్వం చేతగానితనం గానే సగటు మధ్యతరగతి వర్గం భావిస్తుండటం ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళితే ప్రతికూల అంశం అవుతుంది అన్న కోణంలో బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పాపం ఉంది

ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఎక్సైజ్ సుంకం పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. ఏకంగా ఎక్సైజ్ సుంకాన్ని రెట్టింపు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఆ భారం అంతా వినియోగదారుల పై పడింది. ఇక గ్యాస్ ధరలు నెలవారి సగటు చూసి పెంచడం, తగ్గించడం చేసేవారు. ఇప్పుడు రోజువారీ పెట్రోల్ ధరలు అనుగుణంగానే వాటిని సైతం నిర్ణయించడంతో ప్రతిరోజూ ఇవి పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

జమిలి పై ఏం చేద్దాం?

ప్రస్తుతం మధ్యతరగతి వర్గం మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకుంటుంది. భారీగా పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ ధరలకు తోడు ఢిల్లీలో సుమారు రెండు నెలల నుంచి సాగుతున్న రైతు ఉద్యమం కూడా మోడీ ప్రభుత్వం కు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. మరోపక్క ప్రభుత్వ వైఫల్యాలు మీద ప్రతిపక్షాల స్వరం పెరిగింది. దింతో పాటు బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోతున్న ట్లుగా ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్న వేల ఇప్పుడు తొందరపడి జమిలి ఎన్నికలకు వెళితే ఎక్కడ తప్పు చేసినట్లు అవుతుందన్న భయం బిజెపి పెద్దల్లో నెలకొంది. జెమినీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే అది కచ్చితంగా బిజెపి కు తీరని దెబ్బ అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు జెమిని ఎన్నికలపై పునరాలోచనలో బిజెపి నేతలు ఇటు సంఘ్ పరివార్ పెద్దలు పడినట్లు తెలుస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎపై వేటు ..ఎందుకంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

sharma somaraju

Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలు ఇకపై ఆ నిబంధనలు పాటించాల్సిందే .. ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju