NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Tamilanadu : బీజేపీ ఆట.. తమిళనాట ఓట్ల వేట!!

Tamilanadu తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా తమిళనాడు కు వెళ్లి అక్కడ రాజకీయాలను ప్రభావితం చేసేలా సభలు సమావేశాలు నిర్వహించడం లో బీజేపీ పెద్దలు బిజీగా ఉన్నారు .  అన్నాడీఎంకే నూ, జయలలిత వారసత్వాన్ని పార్టీకి (కూటమి ) మాత్రమే చెందేలా బీజేపీ పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tamilanadu
Tamilanadu

Tamilanadu ఆధిపత్యం  తమిళనాడులో చెల్లదు!

తమిళనాడు రాజకీయాల్లో అప్రతిహసంగా సాగిపోతోన్న డీఎంకే పార్టీ కు ప్రత్యామ్నాయంగా 1972లో అన్నాడీఎంకే ను మొదలు పెట్టిన ఎంజీ రామచంద్రన్ తర్వాత కేంద్రం రాజకీయాల్లో అంటీ ముట్టనట్లుగానే ఉండేవారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యాన్ని ఆయన రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకించేవారు. కచ్చితంగా రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలనీ నమ్మేవారు. కేంద్రం నామమాత్రంగానే వ్యవహరించాలి తప్పితే రాష్ట్రాల్లోని అన్ని విషయాల్లో వేలు పెడితే ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనేది ఎంజీఆర్ ప్రశ్న.

దీనికి తగ్గట్టుగానే ఆయన అన్నాడిఎంకె నూ నడిపించారు. ఆయన తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న జయలలిత సైతం ఇదే పద్ధతిని కేంద్రంతో కొనసాగించారు. అన్నా డీఎంకే మద్దతు పొందాలంటే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా జయలలిత పెట్టే డిమాండ్లను కచ్చితంగా అంగీకరించి మాత్రమే అన్నా డీఎంకే మద్దతు పొందాల్సి వచ్చేది. కేంద్ర రాజకీయాల పట్ల అన్నాడీఎంకే వైఖరి అలా ఉంటే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పూర్తిగా అన్నాడీఎంకే నడిపించే పరిస్థితికి వచ్చింది.

Tamilanadu అమ్మ వారసత్వం కోసం బీజేపీ ఆరాటం!

ఈ సారి జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కీలకం. తమిళనాడులో అన్నా డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మొత్తం తానే అన్నట్లుగా రాజకీయాలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న అన్నాడిఎంకె మరోమారు అధికారంలోకి రావాలంటే కచ్చితంగా జయలలిత మృతి తాలూకా సానుభూతి అవసరం. నిన్న మొన్నటి వరకు రజినీకాంత్ మీద కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు జయలలిత వారసత్వం మీద పోరాడుతుంది. కచ్చితంగా జయలలిత మృతిని సానుభూతిని ఓట్ల రూపంలో పొందేందుకు అన్నాడీఎంకే కూటమి, శశికళ వర్గాలు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

శశికళ ఇటీవల తన హావభావాలతో పాటు, అచ్చం జయలలిత స్టైల్ లో తమిళనాడుకు చేరుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తే, దీనిని అన్నాడీఎంకేతో పాటు బీజేపీ నేతలు సైతం ఖండించడం విశేషం. అంతే కాదు ఇప్పుడు ప్రధాని మోదీ ఏకంగా ఎంజీఆర్ జయలలిత చిత్రాలకు వంగి మరి నమస్కరిస్తూ చెన్నై మెట్రో విస్తరణ పనులు ప్రారంభించడం చూస్తే అమ్మ వారసత్వ పోటీ ఎంతలా ఉందో అర్ధం అవుతుంది.

Tamilanadu
Tamilanadu

అప్పట్లో రచ్చ చేసింది ఎవరో?

అల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెంట్రా కాజగం (ఏఐఏడీఎంకే ) వ్యవస్థాపకుడు మారత్తూరు గోపాల రామచంద్రన్ (ఎంజీఆర్) కు 1987లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అప్పుడు దానిని వ్యతిరేకించిన పక్షాలే ఇప్పుడు ఆయన మీద గౌరవం, ప్రేమ చూపించడం విశేషం. రాజగోపాలాచారి, కామరాజు తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతరత్న అందుకున్న వ్యక్తి ఎంజీఆర్. 1987లో ఎం.జి.ఆర్ మరణం తర్వాత 1988 లోనే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. అయితే దీనిని విపక్షాలు తప్పు పట్టాయి.

తమిళనాడులోని ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అత్యంత వేగంగా ఎంజీఆర్కు భారతరత్న ప్రకటించిందని, దీని వెనుక అప్పటి ప్రధాని రాజీవ్ అవార్డు కమిటీని ఒత్తిడి గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివాదం చేసిన వారిలో అప్పటి జనతాదళ్ నాయకుల్లో కీలకంగా ఉన్నవారు.. తర్వాత బీజేపీ లోకి మారిన వారు ఉన్నారు.

శశికళను నిలువరించడం సాధ్యమేనా?

జయలలిత మృతి తర్వాత బీజేపీ అన్నాడీఎంకే మీద పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం. జయలలిత స్నేహితురాలుగా చిన్నమ్మ గా తమిళనాడు ప్రజలకు సుపరిచితం అయిన శశికళను దూరంగా పెట్టి జయలలిత భౌతికకాయం సాక్షిగా బిజెపి రాజకీయాలు మొదలు పెట్టిన విషయం అందిరికి గుర్తే. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి చేసేందుకు అన్నా డీఎంకే లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నప్పటికీ పన్నీర్ సెల్వం దానికి ఒప్పుకోకపోవడం ఆయన వెనుక ఉన్న రాజకీయాలు అందరికీ అర్థమయ్యే వే. కనీసం జయలలిత మృతదేహం వద్దకు కూడా శశికళను రానీయకుండా, పూర్తిగా అన్నాడీఎంకే పార్టీ తరపునే ఆమె అంత్యక్రియలు పూర్తి చేసారు.

దాని తర్వాత లెజిస్లేటివ్ పార్టీ నేతగా శశికళను ఎన్నుకొని, ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు సైతం బీజేపీ అడ్డుపడింది.ఆ నాటి గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళను పిలవకుండా కొన్ని రోజులు తాత్సారం చేయడం అప్పట్లో వివాదానికి సైతం దారితీసింది. దాని తర్వాత అక్రమ ఆదాయం కేసులు, శశికళ అరెస్టులు వేగంగా జరిగిపోయాయి.

తీర్పు సైతం చాలా వేగంగా రావడంతో ఆమె జైలుకు పరిమితమైంది. దాని తర్వాత కథను మొత్తం బిజెపి నడిపించింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు సమీపించిన సమయంలో బిజెపి తీసుకోబోయే చర్యలు, ఎత్తులు ఎలా ఉంటాయి అనేది కీలకంగా మారుతుంది.

author avatar
Comrade CHE

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

sharma somaraju

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలన మొదలెట్టేసినట్లున్నారు(గా)..!

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

sharma somaraju

Big Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ

sharma somaraju

Big Breaking: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు .. ఢిల్లీలో టెన్షన్ .. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ..?

sharma somaraju

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్రానికి భారీ ఊరట ..ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకి నిరాకరణ

sharma somaraju

Shobha Karandlaje: తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి శోభ

sharma somaraju