NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

BJP : ఈ ఐదు కమలం ఖరీదు!

BJP : దేశవ్యాప్తంగా కీలకమైన రాష్ట్రాలుగా ఉన్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల నగారా మోగించింది. ఈ రాష్ట్రాలు ఏవి ప్రస్తుతం బిజెపి పాలిత రాష్ట్రాలు కాకపోవడం విశేషం.

** ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వరుసగా ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూలు ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమలులోకి వస్తుంది. పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ సీట్లు 294 ఉంటే, తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 18. 68 కోట్ల ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల అధికారులు తెలిపారు.

బెంగాల్ లో అత్యధికంగా లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు, తమిళనాడులో 89000, కేరళలో 40000, అస్సాంలో 33000, పుదుచ్చేరిలో 1500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తామని చెప్పారు. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్లు దీనిలోని షెడ్యూల్ ప్రకటించారు.

BJP కమలం ప్రయత్నం

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలో లేదు. ముఖ్యంగా పాండిచ్చేరిలో ఇటీవలే ప్రభుత్వం కూలిపోయింది.

** పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో నువ్వా నేనా అన్నట్లు బిజెపి పోరాడుతోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం హోదాకు బిజెపి చేరువైంది. ఇప్పటికే తృణమూల్కు చెందిన కొందరు నాయకులు ఎమ్మెల్యేలు బిజెపి పక్కకు వచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పూర్తి స్థాయిలో ఎన్నికల మీద దృష్టిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. బిజెపి నాయకులు సైతం తరుచు బెంగాల్ వెళ్లి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికలు చాలా రసవత్తరంగా కనిపిస్తున్నాయి.

BJP
BJP

** తమిళనాడు ఎన్నికలు సైతం బీజేపీ కు ప్రతిష్ఠాత్మక మే. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బిజెపి జయలలిత మరణం తర్వాత మొత్తం వ్యవహారాన్ని వెనకుండి నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ అడుగుల పైన బిజెపి కేంద్ర నాయకులు ఓ కన్నేసి ఉంచారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారపక్షం హోదాలో కొనసాగుతున్న బీజేపీ కూటమి దానిని ఎలాగైనా నిలబెట్టుకోవాలని తాపత్రయంతో పనిచేస్తోంది. మరోపక్క డిఎంకె, కాంగ్రెస్ సైతం దశాబ్దం తర్వాత తమిళనాడు పీఠం మీద కూర్చునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి.

** కేరళలో ప్రస్తుతం వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుటిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఈ రెండు కూటములు ప్రధానంగా ఉంటే ఈసారి కచ్చితంగా తమ ప్రభావం చూపాలని బిజెపి సైతం ఎత్తులు వేస్తోంది.

గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కే పరిమితమైన బిజెపి ఎమ్మెల్యే ఇటీవల పార్టీకి సైతం రాజీనామా చేశారు. మెట్రో మాన్ శ్రీధర్ అన్నతో పాటు పరుగుల రాణి పి.టి.ఉష సైతం బీజేపీ లోకి వస్తారని భావిస్తున్నారు. అలాగైనా కేరళలో పరువు నిలబెట్టుకునే సీట్లు గెలుచుకునేందుకు బిజెపి ఆరాటపడుతోంది.

** సుదీర్ఘకాలంపాటు అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను 2016 లో బీజేపీ మట్టికరిపించింది. తొలిసారిగా ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాంటి ఫలితాల్ని మరోసారి పునరావృతం చేయాలనే పట్టుదలతో బిజెపి ఉంటే, తరుణ్ గొగోయ్ వంటి సీనియర్ మరణంతో కాంగ్రెస్ కాస్తా వెనకబడింది. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్కు లభిస్తాయని ఆ పార్టీ భావిస్తోంది.

** పాండిచ్చేరిలో ఈ మధ్యనే ప్రభుత్వం కూలిపోయింది. 33 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బిజెపి కు అసలు బలం లేదు కేవలం ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో సాగిస్తోంది. ఎన్ ఆర్ కాంగ్రెస్ తో పొత్తు లో ఉన్న బిజెపి, ఈసారి పాండిచ్చేరి శాసనసభలో కచ్చితంగా సత్తా చూపాలని ఆరాటపడుతోంది. కనీస స్థానాలను నెగ్గి ఎన్నార్ కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టడానికి బిజెపి జాతీయ నేతలు సైతం ఇక్కడ పర్యటించడం విశేషం.

author avatar
Comrade CHE

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎపై వేటు ..ఎందుకంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

sharma somaraju