21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మెరిసిన బాలీవుడ్ నటి రియాసేన్

Share

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర లో కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో ఆయనను అనుసరిస్తున్నారు. బాలీవుడ్ తో పాటు పలు భాషా సినిమాల్లో నటించిన ప్రముఖ నటి రియా సేన్ గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ తో కలిసి నడిచారు. బాలీవుడ్ లో స్టైల్, ఖయామత్, ఝంకార్ బీట్స్, ధూమ్, సిటీ అండర్ త్రెట్ తదితర సినిమాల్లో రియా సేన్ నటించారు. రాహుల్ యాత్రలో ఇప్పటి వరకు సినీ నటులు రితేశ్ దేశ్ ముఖ్, పూజా భట్, టీవీ యాక్టర్ సుశాంత్ సింగ్ పాల్గొన్నారు. కాగా రాహుల్ గాంధీ తో కలిసి నడక సాగించిన రేయాసేన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bollywood Actress Riya Sen joins Rahul Gandhi8217s Bharat Jodo yatra in Maharashtra

 

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో ముగిసింది. మహారాష్ట్రలో ఆయన దాదాపు 383 కిమీలు పాద యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని ఆరు పార్లమెంట్, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ పాదయాత్ర సాగుతుంది. 12 రాష్ట్రాల్లో 3570 కిమీలు నడక పూర్తి చేసుకుని రాహుల్ గాంధీ వచ్చే ఏడాది కశ్మీర్ లో యాత్ర ముగించనున్నారు. సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టగా, ఆ పార్టీ శ్రేణుల నుంచే కాకుండా, రాజకీయేతర వర్గాలు, పౌర సంఘాలు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి మంచి స్పందన కనబడుతోంది.

ఏపి ప్రభుత్వ సిట్ పై సుప్రీం కోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు..ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

Bollywood Actress Riya Sen joins Rahul Gandhi8217s Bharat Jodo yatra in Maharashtra

Share

Related posts

Jc Prabhakar reddy : వాలంటీర్ల వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

sekhar

Kitchen hacks: ఇలా చేయడం వలన వంటింట్లో ఎక్కువ వెస్ట్ రాకుండా చేసుకోవచ్చు !!

Kumar

మద్యపాన నిషేధం అంటే ఎక్కువ తాగించడమా?? : లిక్కర్ అమ్మకాల్లో రికార్డు

Comrade CHE