Breaking: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు

Share

Breaking: మహారాష్ట్రలో ఓ పక్క రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏక్ నాథ్ శిందే తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. శిందే నేతృత్వంలో 50 మందికిపైగా ఎమ్మెల్యేలు గువాహటిలోని ఓ స్టార్ హోటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసింది. ముంబాయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హజరు కాావాలని కోరింది.

Breaking: ED Notice to Shiv Sena MP Sanjay raut

 

భూకుంభకోణం కేసులో సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శివసేనలో కీలక నేతగా ఉన్న సంజయ్ రౌత్.. శివసేన అధికార పత్రిక సామ్నా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తున్న వేళ సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ పక్క తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలు వినబడుతున్న వేళ శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

 

రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ రౌత్ ను టార్గెట్ చేసి ఈడీతో నోటీసులు జారీ చేయించిందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మరో పక్క అసమ్మతి ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ శిందేకి రోజురోజుకు బలం పెరుగుతోంది. మరో మంత్రి ఉదయ్ సామంత్ నేడు శిందే శిబిరానికి చేరుకుని మద్దతు తెలియజేశారు. దీంతో శిందే క్యాంపులో చేరిన మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరింది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

4 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

13 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago