భారత్ – పాక్ సరిహద్దులో గత కొంత కాలంగా డ్రోన్ లు కలకలాన్ని రేపుతున్నాయి. పంజాబ్ సరిహద్దులో పాక్ వైపు నుండి క్రమంగా అక్రమ కార్యకలాపాలు పెరిగాయి. చలికాలం కావడం, పొగ మంచు ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు మాదక ద్రవ్యాలను, ఆయుధాలను భారత్ లోకి పంపుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు.

తాజాగా పంజాబ్ లోని అమృత సర్ సెక్టార్ రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ దళాలు ఇవేళ తెల్లవారుజామున కూల్చివేశాయి. పాకిస్థాన్ ఈ డ్రోన్ ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాలు సాగిస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. సరిహద్దు కంచె వద్ద శుక్రవారం ఉదయం బీఎస్ఎఫ్ దళాలు డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ తో పాటు నిషేదిత డ్రగ్స్ ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజుల్ల పంజాబ్ సెక్టార్ లో జరిగిన మూడో సంఘటన ఇది.
Read More: Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు
కేంద్ర బీజేపీకి బిగ్ షాక్ .. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన కామెంట్స్