NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ బిగ్ స్టోరీ

Budget 2022: బడ్జెట్ లెక్కలు..! ఎవరి ఆశలు నెరవేరతాయో..!!

budget 2022

Budget 2022: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ హయాంలో ఇది 10వ బడ్జెట్. ఎప్పటిలానే సామాన్యులు, రైతులు, కార్పొరేట్లు, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలు ఈ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నాయి. అందరినీ సంతృప్తి పరచడం ఎలానూ సాధ్యమయ్యేది కాదు. అయితే.. ఈ బడ్జెట్ అనేక సవాళ్ల మధ్య వస్తోంది. రైతు చట్టాలు రద్దు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ వస్తోంది. 2010లో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు.. బడ్జెట్ అంటే అంకెలు, లెక్కలు మాత్రమే కాదు.. ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేది కూడా. మొత్తంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

budget 2022
budget 2022

ఎన్నో ఆశలు.. ఎందరో ఎదురుచూపులు..

వచ్చే ఏడాదికి భారత జాతీయ స్థూల ఆదాయం వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం వరకూ ఉంటుందని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే రిపోర్ట్ చెప్తోంది. అయితే.. సాధారణ, మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు శక్తి తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ధికాభివృద్ధి ఏమేరకు పుంజుకోగలదనే ప్రశ్న ఉంది. మధ్యతరగతి వర్గాలకు వ్యక్తిగత ఆదాయ పన్నులో రాయితీలు, ప్రభుత్వాన్నే వెనక్కు తగ్గేలా చేసిన రైతులకు పంట గిట్టుబాబు ధరపై ప్రతిపాదనలు, జీవిత భీమా వంటి రాంగాల్లో ఆదాయపు పన్నులో రాయితీ, పట్టణ ఉపాధి పధకం అమలు.. ఇలా అనేక అంశాలపై బడ్జెట్ లో సమాధానం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Union Budget 2022: Whole Budget with Key "Holes"...

ప్రజలకు భారం తగ్గుతుందా..

నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారాలు చేపట్టిన తర్వాత కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారనే వాదనా ఉంది. అందుకు తగ్గట్టే 2019లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. దీనిని పరోక్షంగా పన్నుల రూపం సాధారణ, మధ్యతరగతి వర్గాలపై పడుతోంది. ప్రజలకు అందించే సౌకర్యాలు చౌకగా ఉంటే కొనుగోలు శక్తి పెరిగి పన్నులు వస్తాయి. ఉద్యోగాల కల్పన, కనీస వేతనాలు పెరగాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలి, ధరలు తగ్గాలి, రాష్ట్రాలకు కేటాయించే వాటాలు పెరగాలి. ఇన్ని ఆశలు, కోరికల మధ్య ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టబోయే దేశ బడ్జెట్ ఎందరి ఆశలు నెరవేరుస్తుందో చూడాలి..!

author avatar
Muraliak

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?