దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం సంభవించిది. భజన్ పురా విజయ్ పార్క్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా నేలమట్టమైంది. భవనం రోడ్డు పై కూలిపోతుండగా అక్కడే ఉన్న ఒకరు సెల్ ఫోన్ లో వీడియో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ భవనం కూలిన సమయంలో అందులో ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు.

నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భవనం అకస్మాత్తుగా పడిపోవడానికి గల కారణాలు గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. భవనం పాతగా ఉన్నంతున కూలిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. భవనం కూలిపోయిన సమయంలో ఆ రహదారిపై వాహనచోదకులు, పాదచారులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం ఒక్క సారిగా కూలిపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని వీక్షిస్తున్నారు. భవనం కూలిపోయిన కారణంగా ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ .. రేపటి విచారణకు హజరు కాలేనంటూ..