NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన అత్యంత కీలక నేత

Share

భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి మునిమనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు కేశవన్. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిననే గుర్తింపుతో ఇక ఎంత మాత్రం ఉండలేననీ, అందుకే జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత బాధ్యతను తిరస్కరించానని తెలిపారు. ఈ కారణం వల్లనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేదని పేర్కొన్నారు కేశవన్.

CR Kesavan

 

రెండు దశాబ్దాలకు పైగా తాను పార్టీ కోసం పని చేయడానికి తనను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం లేశమాత్రమైనా కనిపించడం లేదనీ, ఇలా చెప్తున్నందుకు నిజంగా చాలా విచారంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఇక నూతన ఫంధాను నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని కావున కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. తాను మరోక పార్టీలో చేరతారని ఉహాగానాలు రావచ్చు అనీ కానీ తాను ఏ ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు చేయడం లేదని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేనన్నారు.

2001  లో విదేశాల్లో కెరీర్ కాదనుకుని కేశవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీపెరంబుదూర్ లోని రాజీవా గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడుగా, యూత్ కాంగ్రెస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా, పార్టీ ప్రతినిధి ఇలా రెండు దశాబ్దాలుగా కేశవన్ అనేక పదవులు నిర్వహించారు. తనకు పార్టీలో, ప్రభుత్వంలో వివిధ పదవులు ఇచ్చిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లో చత్తీస్‌గడ్ లోని రాయపూర్ లో పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశాలు జరుగబోతున్న ఈ కీలక తరుణంలో సీఆర్ కేశవన్ పార్టీకి గుడ్ బై చెప్పడం సీనియర్ లను షాక్ కు గురి చేసింది.

పన్నీర్ సెల్వానికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పళనిస్వామి వర్గం


Share

Related posts

బీజేపీపై గ్రేట‌ర్ కొత్త గేమ్ ఏంటో తెలుసా?

sridhar

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..?

somaraju sharma

AP greenko project: ఏపి రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు “గ్రీన్‌కో” కు మోకాలడ్డుతున్న తెలంగాణ సర్కార్..! మ్యాటర్ ఏమిటంటే..?

somaraju sharma