NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాక్..! రూ.5లక్షల జరిమానా..! ఎందుకంటే..?

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ ఎన్నిక ఫలితం ప్రకటనలో పలు అక్రమాలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి సువేందు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ    ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే బీజేపీ నేపథ్యం ఉన్న జస్టిస్ కౌశిక్ చందా పిటిషన్ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా మమత బెనర్జీ గత నెల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యదర్శికి లేఖ రాశారు.

Calcutta High Court imposes Rs 5 lakh fine for Mamata Banerjee
Calcutta High Court imposes Rs 5 lakh fine for Mamata Banerjee

మమత అభ్యర్థనపై స్పందించిన జస్టిస్ కౌశిక్ చందా నేడు విచారణ నుండి తప్పుకున్నారు. ఈ పిటిషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ కు పంపారు. అయితే ఈ సందర్భంగా సీఎం ఆరోపణలను న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తీవ్రంగా ఖండించారు. బీజేపీ లీగల్ సెల్ కు తాను ఎప్పుడూ కన్వీనర్ గా లేననీ, కోల్‌కతా హైకోర్టు కు రాకముందు ఆ పార్టీ తరపున కొన్ని కేసులు వాదించానన్నారు. పిటిషనర్ కేసులో విచారణ జరపాలని తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం, ఆసక్తి లేదన్నారు.  ప్రధాన న్యాయమూర్తి తనకు అసైన్ చేసిన పిటిషన్ లపై విచారణ జరపడం తన రాజ్యాంగ విధిగా పేర్కొన్నారు.

Read More: Mamata Banerjee: దీదీ ఇల్లు అలకగానే పండుగ కాదు.. మండలి తీర్మానానికి మోడీ మద్దతు ఇస్తారా..? జరిగితే వండరే..!!

కానీ జూన్ 18న తాను ఈ పిటిషన్ విచారణ చేపట్టిన తరువాత టీఎంసీ నేతలు తన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారనీ, ఇది పూర్తిగా న్యాయమూర్తిని అవమానించేందుకు చేసిన ముందస్తు ప్రణాళిక గా ఉందని జస్టిస్ కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచినందుకు గానూ మమతా బెనర్జీకి రూ.5లక్షలు జరిమానా విదిస్తున్నట్లు చెప్పిన అనంతరం    కేసు విచారణ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. కాగా జస్టిస్ కౌశిక్ చందా కోల్ కతా హైకోర్టు బెంచ్ కు రాకముందు బీజేపి ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. ఆయనను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై మమతా బెనర్జీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N