CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త బాస్ గా ఇటీవలే సుబోధ్ కుమార్ జైశ్వాల్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. సహజంగా ఏ శాఖలోనైనా నూతన బాస్ వచ్చిన తరువాత కొందరు అధికారులు వారి మార్క్ చూపించేందుకు కొన్ని కొన్ని సంస్కరణలు చేస్తుంటారు. వాటిని వారి హయాంలో అమలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫలానా అధికారి హయాంలో ఇలా, అలా అంటూ ఆ శాఖలోని సిబ్బంది తరువాత దానిపై చర్చించుకుంటుంటారు. ఆ అధికారి మార్క్ ఆ శాఖలో గుర్తుండి పోతుంది. అదే తరహాలో సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైశ్వాల్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సీఐబీ సిబ్బంది విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు చూసి సిబ్బంది ఒక్క సారిగా షాక్ అయ్యారు. అది ఏమిటంటే..
సీబీఐ లో పని చేసే సిబ్బంది, అధికారులు అందరూ ఫార్మల్ దుస్తులనే ధరించాలి. ముఖ్యంగా జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్ ధరించకూడదు. క్యాజువల్ దుస్తులతో నీట్ గా విధులకు హజరుకావాలి. సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఉత్తర్వుల మేరకు ఇక పై దేశ వ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల్లో అధికారులు, ఉద్యోగులు ఫార్మల్ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. పురుషులు చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్, షూస్ మాత్రమే ధరించాలి. ఆఫీసుకు శుభ్రంగా షేవింగ్ చేసుకుని హజరుకావాల్సి ఉంటుంది. ఇక మహిళా అధికారులు, సిబ్బంది చీరలు లేదా సూట్స్, చొక్కాలు, ఫార్మల్స్ ధరించవచ్చు. కానీ జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వియర్ ధరించకూడదు.
Read More: AP IAS Transfers: ఏపిలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు…వివరాలు ఇవీ..
ఈ వివరాలను ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను కశ్చితంగా పాటించాల్సి ఉంటుందనీ, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. కార్యాలయాల్లో సరైన స్థితిని ఉంచేందుకే ఇలా అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆదేశాలు జారీ చేసి ఉంటారని సీబీఐకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే వచ్చీ రాగానే అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆదేశాలు జారీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. ముందు ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?