జాతీయం న్యూస్

భారత్ లో మరో 8 యూట్యూబ్ ఛానల్స్ పై వేటు.. అవి ఏమిటంటే..?

Share

దేశంలో మరో ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తల ప్రచారం ఎక్కువైంది. ఈ నేఫథ్యంలో ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న ఎనిమిది ఛానళ్లను నిషేదిస్తున్నట్లు కేంద్ర సమా చార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో ఏడు యూట్యూబ్ ఛానళ్లు భారత్ కు చెందినవి కాగా ఒకటి పాకిస్థాన్ కు చెందింది. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు గానీ ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఉద్వాసన..తెలంగాణ నుండి కే లక్ష్మణ్ కు చోటు

కేంద్రం ఇంతకు ముందు కూడా గత ఏడాది ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానళ్లు, మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ ఫేస్ బుక్ ఖాతాను బ్లాక్ చేసింది. గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్ మీడియా లో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102 కి చేరుకుంది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానళ్లు .. దాదాపు 86 లక్షల మంది సబ్ స్క్రైబర్ లు, 114 కోట్ల మంది వ్యూస్ తో అకౌంట్లను కల్గి ఉన్నాయి. కాగా ఈ ఛానళ్లు భారతదేశంలో మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత సాయుద బలగాలు, జమ్ముకశ్మీర్ కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది. దేశ సమగ్రత, సారభౌమధికారాన్ని బలహీనపర్చేలా సామాజిక మాథ్యమాలు ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?


Share

Related posts

Sai Pallavi: అబ్బో, అమ్మాయి జోరు మామూలుగా లేదుగా.. ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి..!

Ram

వార్ వన్ సైడైపోయిందా?

Siva Prasad

RRR : ఆర్ఆర్ఆర్ …కొమురం భీం ఎలా ఉంటాడు..?

GRK