కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను కేంద్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయనీ, ప్రతిపక్ష పార్టీలపై వీటిని ప్రయోగిస్తున్నారంటూ చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సమ్మతిని ఉపసంహరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని మరింత శక్తి వంతం చేస్తూ కేంద్రం చర్యలు చేపట్టింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులను చేసింది.

రాష్ట్ర పోలీస్ విభాగాలనూ ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది కేంద్రం. దీంతో ఈడీ కోరిన ఏ సమాచారాన్ని అయినా రాష్ట్ర పోలీస్ విభాగాలు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.