Whatsapp: దేశంలో ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ కాల్స్ అడ్డగించి ప్రభుత్వం పరిశీలించే తరహాలో కొత్త ముసాయిదా టెలికాం బిల్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం అంతా అనుకున్నట్టు జరిగితే.. దేశంలో టెలికమ్యూనికేషన్ లను నియంత్రించే పూర్తీ అధికారం కేంద్రానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లు ద్వారా.. ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం..1885, వైర్ లెస్ టెలిగ్రాఫీ చట్టం..1933, టెలిగ్రాఫ్ ఫైర్స్.. చట్టం ఇంకా 1950 లను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. 21వ శతాబ్దపు పరిస్థితులకు అనుగుణంగా దేశంలో టెలికమ్యూనికేషన్ లను నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరమని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు టెలికాం మంత్రి స్పష్టం చేశారు.

ఈ కొత్త టెలికామ్యూనికేషన్ ముసాయిదా బిల్లు.. చట్టంగా రూపు దాల్చుకుంటే.. ఇక వాట్సాప్ సందేశాలు మరియు కాల్స్ సిగ్నల్.. ఇంకా ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్.. లకి సంబంధించి ఎన్‌క్రిప్టెడ్ ప్రైవసీ, సెక్యూరిటీ కలిగిన వాట్సాప్, గూగుల్ డుయో, జూమ్, టాప్ కాలింగ్, మెసేజింగ్ సంస్థలు లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త ముసాయిదా బిల్లులో వాయిస్ మెయిల్, వాయిస్ వీడియో అండ్ డేటా కమ్యూనికేషన్ సర్వీసెస్, ఫిక్స్ డ్ అండ్ మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ అండ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్, సాటిలైట్ బెస్ట్ కమ్యూనికేషన్ సర్వీసెస్, ఆడియోటేక్స్ సర్వీసెస్, వీడియోటేక్స్ సర్వీసెస్ పరిశీలనలోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో ఇండియన్ టెలికాం బిల్ 2022 ముసాయిదా పోస్ట్ చేసి అక్టోబర్ 20వ తారీకు లోపు అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఈ కొత్త టెలికాం ముసాయిదా బిల్లు ద్వారా టెలికాం పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ కి ప్రైవసీ మరియు సెక్యూరిటీ కల్పిస్తూ చాలా సంస్థలు మనుగడు సాగిస్తూ ఉన్నాయి. ఈ కొత్త టెలికాం చట్టం వస్తే ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ ఆధారం చేసుకుని మనుగడు సాగిస్తున్న సంస్థలు దివాలా తీసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.