NewsOrbit
జాతీయం న్యూస్

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ‌కు గాయాలు, భార్య, పీఏ మృతి

రక్షణ, అయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాదనాయక్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడగా కేంద్ర మంత్రి భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి (పిఎ) దీపక్ మృతి చెందారు.

 

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ‌కు గాయాలు, భార్య, పీఏ మృతి
central minister Shripad naik severely injured in accident wife and pa died

శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. మంత్రి ఎల్లపూర్ నుండి గోకర్ల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడిన నాయక్ దంపతులను, పి ఎ దీపక్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సరికి శ్రీపాద నాయక్ సతీమణి విజయ, పిఏ దీపక్ లు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కు మెరుగైన వైద్యం కోసం గోవాలోని బంబోలి ఆసుపత్రి కి తరలించారు. ఘటనపై ప్రధాన మంత్రి మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ లు వెంటనే స్పందించి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఫోన్ చేసి శ్రీపాద నాయక్ కు  మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించాలని రాజ్ నాధ్ సింగ్ సూచించారు. సీఎం సావంత్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

central minister Shripad naik severely injured in accident wife and pa died

 

ఇది కూడా చదవండి..ప్రజా ప్రతినిధులకు పిఎం మోడి షాక్.. టీకాకు పోటీపడవద్దని సూచన

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju