Adani: కేరళ రాష్ట్రం కొచ్చిలో ఆదానీ గ్యాస్ పైప్ లైన్ నుండి రసాయన లీకేజీ సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్యూటైల్ మెర్ కాప్టాన్ అనే రసాయనాన్ని తరలించే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయినట్లు తెలుస్తొంది. శుక్రవారం రాత్రి పైప్ లైన్ నిర్వహణ పనులు చేస్తుండగా లీక్ జరిగింది. ఎర్నాకులం జిల్లాలోని కలమస్సేరి, కక్కనాడ్, ఎడపల్లి, క్యూశాట్ ప్రాంతంలోని ప్రజలు రసాయనాలకు సంబంధించి ఘాటైన వాసన వచ్చినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ రసాయనం విషపూరితం కాదని కంపెనీ చెబుతోంది.

బ్యూటిల్ మెర్కాపాస్ట్ రసాయనాన్ని ఎక్కువ కాలం పీల్లడం వల్ల మానవుల శరీరంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇది చర్మంపైనా, కళ్లలో దురదుల వల్ల చికాకు పెడుతుందనీ, చర్మంపై దద్దుర్లు రావచ్చనీ, అలాగే ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులలో ఇబ్బందులకు దారి తీయవచ్చని పేర్కొంటున్నారు. ఈ రసాయనాన్ని ఎక్కువ పీల్చడం వల్ల ప్రజల్లో వికారం, మైకము, తలనొప్పి లాంటి లక్షణాలు కనబడవచ్చని అంటున్నారు.
పుట్టపర్తిలో ఉద్రిక్తత .. వైసీపీ – టీడీపీ శ్రేణుల బాహాబాహీ