Chhatrapati Shivaji Weapon: కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులు వంటి అపార సంపదనకు పుట్టినిల్లు భారతదేశం. అందుకే ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొన్న సంగతి విదితమే. నాటి అలెగ్జాండర్ మొదలు కొని అంగ్లేయుల వరకూ భారతదేశాన్ని కొల్లగొట్టారు. భారతదేశాన్ని వారి చెప్పు చేతల్లో తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకు వెళ్లారు. వాటిలో అత్యంత విలువైన కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో పాటు అనేక కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైఢుర్యాలు ఉన్నాయి. ఇలా తరలించిన అరుదైన భారతీయ కళాఖండాలు విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియంలో ఉన్నాయి. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా అక్కడ ఉన్న మన అపరూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.
ఈ క్రమంలోనే మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన వాఘ్ నఖ్ (పురిగోళ్ల మాదిరిగా ఉండే ఆయుధం) బాకు త్వరలోనే యూకే నుండి భారతదేశానికి తీసుకురానున్నారు. ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. 17వ శతాబ్దంలో చత్రపతి శివాజీ మహారాజ్.. సుల్తాన్ అఫ్జల్ ఖాను చంపేందుకు ఉపయోగించిన వాఘ్ నక్ ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియంలో ఉంది. సతారా ఆస్థానంలో శివాజీ వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ కు అందజేశారు. తర్వాత దీనని ఆయన బ్రిటన్ తీసుకువెళ్లాడు. ఆ తర్వాత డఫ్ వారుసులు శివాజీ ఆయుధం వాఘ్ నఖ్ ను మ్యూజియంకు విరాళంగా అందజేశారు.
అయితే మరాఠా ప్రజల మనోభావాలు, వారసత్వానికి, చరిత్రకు ప్రతీక అయిన వాఘ్ నఖ్ ను వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350 వ వార్షికోత్సవాన్ని త్వరలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అక్కడి విక్టోరియా, అల్జర్ట్ మ్యూజియం తో చర్చలు జరిపారు. ఇప్పటికే బ్రిటీష్ డిప్యూటి హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ, ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటి హెడ్ ఇమోజెన్ స్టోన్ తో చర్చించినట్లు మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.
వారితో చర్చలు అనంతరం శివాజీ ఆయుధాన్ని తిరిగి ఇవ్వడానికి బ్రిటన్ అధికారులు అంగీకరించారని, ఈ మేరకు అక్కడి అధికారి నుండి లేఖ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరులో ఒక ఎంవోయుపై సంతకం చేయడానికి లండన్ వెళ్లనున్నామన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే వాగ్ నఖ్ భారత్ కు వస్తుందన్నారు. చత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం వాగ్ – నఖ్ తిరిగి భారతదేశానికి త్వరలో రానుండటంతో మరాఠావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu: చంద్రబాబు ఊహించిందే జరిగింది.. చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ