China: ట్రంప్ బాటే నా బాట‌… చైనాకు బైడెన్ షాకులు

Share

China: క‌రోనా మ‌హ‌మ్మారిని ప్ర‌పంచానికి అంటించిన చైనాకు షాకులు త‌ప్ప‌డం లేదు. అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోమారు చైనా దేశంపై ఉక్కుపాదం మోపింది. గ‌త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌లే ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చైనాకు చెందిన 28 కంపెనీల‌పై తాజాగా అమెరికా నిషేదం విధించింది. దీంతో షాక్ తిన‌డం చైనా వంతు అయింది.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

బైడెన్ ఇలా షాకిస్తాడ‌ని అనుకోలేదు…

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో చైనా వైర‌స్ త‌మ ఆర్ధిక వ్య‌వస్థ అత‌లాకుతలం కావ‌డానికి కార‌ణ‌మ‌ని ప‌లుమార్లు ఆరోపించారు. దీంతోపాటుగా 31 చైనా కంపెనీల‌పై ట్రంప్‌ నిషేదం విధించారు. అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బైడెన్ హ‌యాంలో చైనాతో అమెరికా స‌త్సంబందాలు కొన‌సాగుతాయ‌ని ప‌లువురు ఊహించారు. అయితే, ఆయ‌న ట్రంప్ దారిలోనే న‌డుస్తున్నా. బైడెన్ స‌ర్కార్ చైనాపై ఉక్కుపాదం మోపింది. చైనాకు చెందిన 28 కంపెనీల‌పై నిషేదం అమెరికా ప్ర‌భుత్వం విధించింది. బ్లాక్ లిస్టులోని ఈ కంపెనీలు చైనా సైన్యంతో క‌లిసి ప‌నిచేస్తూ నిఘా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాయ‌ని అమెరికా ప్ర‌భుత్వం తెలిపింది. ఈ నిషేదం ఆగ‌స్టు 2 నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని బైడెన్ ప్ర‌భుత్వం తెలిపింది. బైడెన్ అధ్య‌క్షుడు అయిన‌ ఆరు నెల‌ల కాలంలోనే అమెరికా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చైనా షాక్ తింది.

Read More: Corona: క‌రోనాతో కాదు ఎలుక‌ల‌తో చ‌స్తున్నాం… భార‌త్ ను స‌హాయం కోరిన ఆ దేశం


ట్రంప్ రీ ఎంట్రీ

ఇటీవల పలు అధ్యయనాలు చైనాలోని వూహాన్​ ల్యాబ్​ లో క‌రోనా వైరస్​ను సృష్టించారంటూ పేర్కొన్న నేప‌థ్యంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న కరోనా మ‌హ‌మ్మారి వైరస్ పుట్టుక‌పై తాను ముందు చెప్పిందే నిజమైంద‌ని ట్రంప్ చెప్పారు. వూహాన్‌ ల్యాబ్‌ నుంచే క‌రోనా వైరస్ వచ్చిందని అప్పుడు తాను చెప్పింది నిజ‌మేనని ఇప్పుడు త‌న రాజ‌కీయ‌ శత్రువులతో సహా అంద‌రూ అంటున్నార‌ని పేర్కొన్నారు. క‌రోనా సృష్టించి ఇంత‌టి విధ్వంసానికి పాల్ప‌డినందుకు చైనా భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్పద‌న్నారు. ల‌క్ష‌ల‌ మరణాలు, ఊహించ‌ని విధ్వంసానికి కార‌ణ‌మైన చైనా అమెరికా తో పాటు ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ ప‌ది ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాల‌ని ట్రంప్‌ డిమాండ్ చేశారు.


Share

Related posts

అడిలైడ్ : భారత్ విజయానికి 4 వికెట్లు

Siva Prasad

నెక్స్ట్ “గంటా” ఫిక్స్… సంకేతాలు వచ్చే”సాయి”!

CMR

కలెక్టర్‌పై ఈసి వేటు

somaraju sharma