NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

China: చైనాలో ముస్లింల‌పై దారుణాలు… క‌మ్యూనిస్టులు ఏం చెప్తారో

China: డ్రాగ‌న్ కంట్రీ చైనా లో మ‌రో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. చైనాలోని మైనార్టీల‌పై ఆ దేశం వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపణ‌లు భ‌గ్గుమంటున్న స‌మ‌యంలో సంచ‌ల‌న నివేదిక వ‌చ్చింది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఉయిగ‌ర్ ముస్లింల‌తో పాటు ఇత‌ర తెగ‌ల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను డ్రాగ‌న్ దేశం అణిచివేస్తున్న‌ట్లుగా కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌నల్ ఘాటుగా స్పందించింది.

Read More: Corona: షాక్ః క‌రోనా టీకా డోసుల మ‌ధ్య గ్యాప్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌…

ఆమ్నెస్టీ ఏమంటుందంటే…

మాన‌వ‌త్వానికి వ్య‌తిరేకంగా చైనా నేరాల‌కు పాల్ప‌డుతోంద‌ని, వ్య‌వ‌స్థీకృత రీతిలో స్థానిక ముస్లింల‌ను అరెస్టు చేస్తున్న‌ట్లు ఆమ్నెస్టీ ఆరోపించింది. చైనా అకృత్యాల‌కు సంబంధించిన నివేదిక‌ను ఆమ్నెస్టీ విడుద‌ల చేసింది. ఆ నేరాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. ఉయిగ‌ర్స్‌, క‌జ‌క్స్‌తో పాటు ఇత‌ర మైనార్టీల‌ను అక్ర‌మంగా నిర్బంధిస్తున్నార‌ని అమ్నెస్టీ మండిప‌డింది. డిటెన్ష‌న్ సెంట‌ర్‌లో బంధించి.. తీవ్రమైన వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపింది. జిన్‌జియాంగ్ ప్రావిన్సులో చైనా అత్యంత దుర్భ‌ర‌మైన న‌ర‌కాన్ని సృష్టిస్తున్న‌ట్లు అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆగ్నెస్ క‌ల్ల‌మార్డ్ తెలిపారు. వేలాది సంఖ్య‌లో మైనార్టీ ముస్లింల‌ను, ఇత‌రుల‌ను జైళ్ల‌లో నిర్బంధించి వారిని వేధిస్తున్నార‌ని, ఇక ల‌క్ష‌లాది మందిపై నిఘా పెట్టి వారంతా భ‌యంలో జీవించేలా చేస్తున్న‌ట్లు క‌ల్ల‌మార్డ్ ఆరోపించారు. చైనాలో మైనార్టీల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను అడ్డుకోవ‌డంలో ఐక్యరాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గుటెర్ర‌స్‌ విఫ‌ల‌మైన‌ట్లు ఆమె పేర్కొన్నారు. 55 మంది నిర్బంధ వ్య‌క్తుల్ని ఇంట‌ర్వ్యూ చేసిన అమ్నెస్టీ మొత్తం 160 పేజీల నివేదిక‌ను రిలీజ్ చేసింది.

Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైద‌రాబాద్‌లో క‌రోనా టీకా

లెఫ్ట్ నేత‌ల లెక్క ఏంటో…

ఆమ్నెస్టీ కామెంట్ల నేప‌థ్యంలో వామ‌ప‌క్ష పార్టీల నేత‌ల వైఖ‌రి ఏంట‌ని ముస్లిం సామాజికవ‌ర్గ ఉద్య‌మ‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు.
చైనా చ‌ర్య‌ల‌పై వారు స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మైనార్టీల పేరుతో ముస్లింల‌కు మ‌ద్ద‌తు తెలిపే వామ‌ప‌క్ష నేత‌లు ఇప్పుడు త‌మ భావాజాలానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్పుకొనే చైనాలో జ‌రుగుతున్న దారుణాల‌పై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆమ్నెస్టీ నివేదిక‌పై స్పందించిన ఓ సంఘం ప్ర‌శ్నించింది.

author avatar
sridhar

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N