NewsOrbit
జాతీయం న్యూస్

తదుపరి సీజేఐ గా జస్టిస్ యూయూ లలిత్

భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఎన్ వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. సుప్రీం కోర్టులో తన తరువాత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ పేరును 49వ సీజేఐగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సీజే జస్టిస్ ఎన్ వీ రమణ లేఖ రాశారు. న్యాయశాఖ ఆ ప్రతిపాదనను ప్రధాన మంత్రి పరిశీలనకు పంపనుంది. పీఎం మోడీ పరిశీలన అనంతరం ఆ ప్రతిపాదన రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు.

 

ప్రస్తుత సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీ పదవీ విరమణ చేయనుండగా, ఆ మరుసటి రోజు (ఆగస్టు 27న) సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే (74 రోజులు) ముగుస్తుంది. నవంబర్ 8న ఆయన పదవీ విరమణ అవుతారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెల్లడించిన ధర్మాసనాల్లో జస్టిస్ యూయూ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. బార్ నుండి నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా నిలుస్తారు జస్టిస్ యూయూ లలిత్. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు.

 

1975 నవంబర్ 9వ తేదీన జన్మించిన ఆయన 1983 జూన్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985 వరకూ బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 జనవరి నుండి సుప్రీం కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 2004లో సీనియర్ న్యాయవాది హోదా సాధించారు. అనేక కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించారు. క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్టగా పేరు గాంచారు. 2014 ఆగస్టు 13న సుప్రీం న్యాయమూర్తిగా నియమితులైయ్యారు జస్టిస్ యూయూ లలిత్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?