NewsOrbit
జాతీయం ప్ర‌పంచం

Corona: క‌రోనా క‌ట్ట‌డికి రూల్స్ పాటించ‌క‌పోతే లాక్ డౌన్ పెట్టేస్తానంటున్న సీఎం

Corona: క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో దేశంలోని వివిధ వ‌ర్గాలు ఏ స్థాయిలో ఆందోళ‌న చెందాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ప‌లు రాష్ట్రాలు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ముప్పు ఎదుర్కుంటున్నాయి. అయితే, మ‌హారాష్ట్రలో గ‌త కొద్దిరోజులుగా డెల్టా వేరియంట్ క‌ల‌క‌లం కొన‌సాగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర సీఎం తాజాగా ఘాటుగా స్పందించారు.

Read More: Corona: మళ్లీ క‌రోనా డేంజ‌ర్ జోన్లోకి మ‌హారాష్ట్ర… అస‌లేం జ‌రుగుతోంది?

India Lockdown: Supreme and Scientists Serious Warn

లాక్ డౌన్ పెట్ట‌డ‌మే…
క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు నిబంధనలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్ విధించక తప్పదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆ రాష్ట్ర ప్రజలను మరోసారి హెచ్చరించారు. ఈ మధ్య కరోనా కొత్త కేసుల నమోదు తగ్గింది కాబట్టి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేశాం. ప్రజలు నిబంధనలు పాటించకపోతే.. మళ్లీ వైరస్ విజృంభిస్తుందని.. అప్పుడు ఆంక్షలు విధించి.. మరోసారి లాక్‌డౌన్ అమలు చేయక తప్పదని ఉధ్దవ్ హెచ్చరించారు. ప్ర‌స్తుతం ఆంక్ష‌లు ఎత్తివేసినందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఉద్ధ‌వ్ థాక్రే సూచించారు. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ప్ర‌బ‌లే ప్ర‌మాదం ప్రమాదం ఉంద‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్రక్రియ నిరంతరం కొన‌సాగుతున్నా.. స‌రిప‌డా ఔష‌ధాలు అందుబాటులో ఉన్నా కూడా.. మాస్క్ ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం లాంటి క‌రోనా నిబంధ‌న‌లు తూ.చ త‌ప్పకుండా పాటించాల్సిందే అని ఆయన సూచించారు. లేదంటే కేసులు పెరుగుతాయ‌ని, అప్పుడు మ‌ళ్లీ ఆంక్ష‌లు విధించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించారు. గతంలో కూడా పలుసార్లు కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించిన సీఎం థాక్రే తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హాలో కామెంట్లు చేయ‌డం ఆ రాష్ట్రంలోని ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Read More: Corona: మళ్లీ క‌రోనా డేంజ‌ర్ జోన్లోకి మ‌హారాష్ట్ర… అస‌లేం జ‌రుగుతోంది?

ఇది గుడ్ న్యూస్‌…
ఇదిలాఉండ‌గా, దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని తెలిపింది. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20వేల కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇందులో 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 3,69,846కి తగ్గి.. 146 రోజుల కష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. దేశంలో రికవరీ 97.51 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

author avatar
sridhar

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju