Cold Wave: ఉత్తర భారత దేశంలో చలి అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో ఢిల్లీ ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 15వ తేదీ వరకూ సెలవు ప్రకటించింది. చలి గాలుల దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను కూడా ఈ నెల (జనవరి) 15వ తేదీ వరకూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా డైరెక్టరేట్, (డీఓఇ) ఆదివారం నోటీసు జారీ చేసింది. దట్టమైన పొగమంచుతో ఆదివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.

గౌతమ్ బుధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నోయిడాలోని అన్ని బోర్డుల పాఠశాలలను ఇప్పటికే జనవరి 12 వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలో చలి బీభత్సం సృష్టిస్తొంది.
పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడానికి సిద్దమంటూ ప్రకటించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
