2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం చివరి రోజు మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పదవీ కాలాన్ని జూన్ 2024 వరకూ పొడిగించడంపై పార్టీ అగ్రనేతలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నాయకత్వంలో బీజేపీ 2024 ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది, మళ్లీ దేశానికి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడతారని అన్నారు.

పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పనితీరును అమిత్ షా ప్రశంసిస్తూ 2020 జనవరి 20న పదవి చేపట్టిన నాటి నుండి కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడించిందన్నారు. అయినప్పటికీ నడ్డా నాయకత్వంలో పార్టీ గణనీయమైన పురోగతి సాదించిందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో పేదలకు ఉచితంగా ఆహారం అందించడం, రేషన్ అందించడం లేదా వైరస్ బారిన పడిన వారి వారికి తనిఖీలు, చికిత్సల కోసం ఆసుపత్రులకు తీసుకువెళ్లడం వంటి చర్యలను గుర్తు చేశారు. దేశంలోని రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నది ఒక్క బీజేపీయేనని అమిత్ షా పేర్కొన్నారు.
దేశంలో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ బీజేపీయేనన్నారు. భారతీయ జనసంఘ్ స్థాపన నుండి ఈ రోజు వరకూ బీజేపీలో ఎన్నికలు, బూత్ స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకూ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నాయని గుర్తు చేశారు. నడ్డా నాయకత్వంలో సేవా హి సంగతన్ అన్న సూత్రంతో బూత్ నుండి జాతీయ స్థాయి వరకూ పని చేస్తొందని అన్నారు. కాాగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు ప్రతిపాదనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
Medak car fire accident case: అతని చావు తెలివి చచ్చుబండలైంది