NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై..? కీలక ప్రకటన చేసిన సోనియా గాంధీ

చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్ ముగిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మూడు రోజుల పార్టీ ప్లీనరీ లో 1500 మంది ప్రతినిధులు పాల్గొనగా, ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్ర సందర్భంగా రుజువైనట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

sonia gandhi

 

ప్లీనరీలో బీజేపీ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోనియా గాంధీ. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోడీ సర్కార్ అన్ని సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. ఆదానీ వంటి సంస్థలను పెంచి పోషిస్తొందని సోనియా అన్నారు. రాజ్యాంగ విలువలను బీజేపీ ఎప్పుడో మర్చిపోయిందని విమర్శించారు. తాను తొలి సారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన నాటి పరిస్థితలను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రస్తుత పాలనను పటిష్టంగా ఎదుర్కొవాలని, పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని ఆమె కోరారు.

2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడానికి భావసారూప్యత గల సెక్యులర్ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని పార్టీ అభిప్రాయపడింది. ఎన్నికల కార్యాచరణపై తీర్మానం చేసింది. గుర్తించడం, సమీకరించడం, కలిసి పని చేయడం అనే ఫార్ములా ప్రకారం ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. సెక్యులర్, సోషలిస్ట్ పార్టీలను ఏకం చేయడమే కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక అని తెలిపింది. కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలని, సారూప్య సిద్దాంతాల అధారంగా విపక్ష పార్టీలను తక్షణమే ఏకం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లబ్దిచేకూరుతుందని అభిప్రాయపడింది.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన నాయకత్వం అందించగలదని చెప్పింది. ఈ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది. రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ కేటగిరిల్లో అన్ని స్థాయిలో యువత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించింది. కాంగ్రెస్ తన వర్కింగ్ కమిటీ లో సభ్యుల సంఖ్యను 25 నుండి 35 కు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పార్టీ మాజీ ప్రధానులు, ఏఐసీసీ మాజీ చీఫ్ లను చేర్చడానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించారు.

అమరావతి భూముల కొనుగోలు స్కామ్ లో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ .. మాజీ మంత్రి నారాయణ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!