జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Congress: ఈవీఎంలు వద్దు – బ్యాలెట్ యే ముద్దు .. ఈవిఎంలపై కాంగ్రెస్ రాజకీయ తీర్మానం

Share

Congress: కాంగ్రెస్ పార్టీ తమ మిత్ర పక్షాలతో కలిసి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఈవిఎంల వినియోగాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలను వినియోగించడం లేదనీ, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుపుతున్నారని పేర్కొన్నాయి. ఈవిఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో నాడు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇవీఎంలను టాంపరింగ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈవిఎంలు వద్దు – బ్యాలెట్ పేపరే ముద్దు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఉదయ్ పుర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో తీర్మానాన్ని ఆమోదించారు. వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సమూల ప్రక్షాళన లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకుంది.

Congress key decision on EVM's
Congress key decision on EVM’s

ఇవీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు

  • పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈవీఎంలకు స్వస్తి పలకాలి. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలి.
  • ఒక కుటుంబానికి ఒకే టికెట్
  • నాయకుల పోస్టు పదవీ కాలం అయిదేళ్లు కొనసాగింపు
  • యువతకు 50 శాతం భాగస్వామ్యం, బ్లాక్ స్థాయి నుండి సిడబ్ల్యుసీ వరకూ 50 శాతం యువతకు అవకాశం
  • 50 శాతం యువత కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు చోటు
  • కేరళ తరహాలో పార్టీకి జాతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు
  • కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయ పడేందుకు వివిధ కమిటీలు


Share

Related posts

హౌస్ లో ఆ ఇద్దరికీ నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది తేల్చేసిన నాగబాబు..!!

sekhar

మాజీ సిఇఒ ద్వివేదికి కీలక పోస్టింగ్

somaraju sharma

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar