Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెక్యురిటీ సిబ్బంది లేకుండా లారీలో ప్రయాణం సాగించడం చర్చనీయాంశం అయ్యింది. రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి చండీగఢ్ కు ఓ లారీలో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్లా కు వెళుతున్న రాహుల్ గాంధీ మార్గమధ్యంలో ట్రక్కు డ్రైవర్ల తో ముచ్చటించారని కాంగ్రెస్ వెల్లడించిది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం వేసవి విడిదిలో భాగంగా శిమ్లాలో ఉన్నట్లు సమాచారం. ఆమెను కలిసేందుకు బయలు దేరినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలోనే తన ప్రయాణంలో ట్రక్కు డ్రైవర్ లతో రాహుల్ కలిశారని కాంగ్రెస్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది ట్రక్కు డ్రైవర్ లు ఉన్నారని, వారికి అనేక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపింది. ట్రక్కు డ్రైవర్ల మన్ కీ బాత్ ను రాహుల్ గాంధీ విన్నారని ట్వీట్ చేసింది కాంగ్రెస్. సోమవారం రాత్రి లారీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో అంబాలలోని ఓ గురుద్వారాకు సందర్శించారు. అక్కడ ప్రార్థనలు చేసి ట్రక్ ఎక్కి చండీగఢ్ వైపు వెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు.

రాహుల్ గాంధీ మార్గమధ్యలో ఓ దాబా వద్ద ఆగి ట్రక్కు డ్రైవర్ లతో ముట్లాడటం వీడియోలో కనిపిస్తొంది. డ్రైవర్ల సమస్యలపై రాహుల్ మాట్లాడినట్లు సమాచారం. దేశంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతోందనీ, దాన్ని భర్తీ చేసేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ట్రక్కులో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారనీ, రాత్రంతా వారి సమస్యలను ఓపికతో విన్నారని, మెరుగైన భవిష్యత్తు రాబోతోందని కొంత మందికి అర్ధమైందని సుప్రియ చెప్పుకొచ్చారు.
YS Viveka Case: సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి మరో సారి ఎదురుదెబ్బ.. కానీ.. కీలక ఆదేశాలు

जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY
— Congress (@INCIndia) May 23, 2023