29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary on PM Modi: పీఎం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. 2002 గుజరాత్ అల్లర్లపై సిరీస్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

Share

BBC Documentary on PM Modi:  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. ఇండియా ది మోడీ క్వశ్చన్ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇది పక్షపాతంతో కూడిన ప్రచారంలో భాగమని తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేసింది. ప్రధాని మోడీని అపఖ్యాతి పాల్జేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారని తాము భావిస్తున్నామనీ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం వెనుక వలసవాద మనస్తత్వం కనిపిస్తొందని, దీని వెనుక ఉద్దేశం మమ్మల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు.

PM Modi

 

బీబీసీ రెండు భాగాల సిరీస్ గా తీసుకువచ్చిన డాక్యుమెంటరీలో తొలి భాగాన్ని బుధవారం ప్రసారం చేసింది. ఈ సిరీస్ లో 2002 గుజరాత్ అల్లర్లు ఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. 2002 లో గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్న మోడీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను ఇది వరకే సుప్రీం కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. అయితే బీబీసీ డాక్యుమెంటరీలో 2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ, భారతదేశంలోని ముస్లిం మైనార్టీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకూ మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో మోడీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. దీంతో యూట్యూబ్ నుండి దాన్ని తొలగించారు. జనవరి 24న రెండో సిరీస్ రావాల్సి ఉంది.

PM Modi

 

భారత్ లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కాలేదు కానీ వేరే దేశాల్లో దీన్ని చూసిన భారతీయులు, భారతీయ మూలాలు గల బ్రిటన్ పౌరులు ఆ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. వంద కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపర్చిందని యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్ట్స్ మెంబర్ లార్డ్ రామి రేంజర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ డాక్యుమెంటరీపై స్పందించారు. బ్రిటన్  పార్లమెంట్ లో పాకిస్థాన్ సంతతికి చెందిన ఎంపి ఇమ్రాన్ హుస్సేన్.. ఈ డాక్యుమెంటరీ పై భారత ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అలాంటి దేశంతో యూకే దౌత్య సంబంధాలు కొనసాగించడం సరికాదంటూ మాట్లాడగా, ఆ వ్యాఖ్యలను రిషి సునాక్ ఖండించారు.  దౌత్య సంబంధాల విషయంలో యూకే ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. సుదీర్ఘ కాలం కొనసాగుతున్న సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అయితే ఎంపీ చెప్పిన మాటల్లో నిజం ఉందని తాను పూర్తిగా అంగీకరించలేనని అలాగని ఎక్కడైనా హింసను సహించబోమని రుషి సునాక్ వ్యాఖ్యానించారు.

rishi sunak, modi

 

2002 లో ఫిబ్రవరిలో అయోధ్య నుండి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వే స్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా మత ఘర్షణలు చెలరేగాయి. మూడు మాసాల పాటు గుజరాత్ రాష్ట్రం అల్లర్లతో అట్టుడికిపోయింది. ఈ ఘర్షణల్లో దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. ఆ సమయంలో మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ అల్లర్లప ఏర్పాటు చేసిన సిట్ 2012లో మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. కొంత మంది మాత్రం నరేంద్ర మోడీ పాత్ర ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని నివేదికలో పేర్కొంది. సామాజిక హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్ తప్పుడు ఆరోపణలతో మోడీని ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీని వెనుక అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ అల్లర్లలో మోడీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను గత ఏడాది సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. అప్పటి హింసా కాండలో మృతి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జప్రీ భార్య జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ కు అర్హత లేనిదిగా సుప్రీం కోర్టు తెలిపింది.


Share

Related posts

Mahesh: మహేశ్ ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందే నిజమైతే ప్రభాస్ మార్క్‌ను టచ్ చేయడం అసాధ్యమే..!

GRK

AP High Court: హైకోర్టు లో ఏపి సర్కార్ కు షాక్ ల మీద షాక్ లు

somaraju sharma

KCR: మోత్కుప‌ల్లికి కేసీఆర్ కండువా క‌ప్పేది అందుకేనా?

sridhar