NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

corona: గ‌త కొద్దికాలంగా క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా థ‌ర్డ్‌వేవ్ విష‌యంలో ఓ తీపిక‌బురు. కరోనా థర్డ్ వేవ్‌‌ ఎఫెక్ట్ పిల్లలపై తక్కువే ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. వైరస్ బారిన పడిన చిన్నారులలో 95% మంది ఇంటివ‌ద్దే కోలుకుంటారని చెప్పింది. వీరిలో చాలా మందిలో లక్షణాలు కనిపించకపోవడమో, చాలా తక్కువ స్థాయిలో కనిపించడమో జరుగుతుందని వివరించింది. ఇలాంటి కేసులకు ఇంట్లోనే ట్రీట్మెంట్అందిస్తే సరిపోతుందని తెలిపింది.

Read More: Corona: షాక్ః క‌రోనా టీకా డోసుల మ‌ధ్య గ్యాప్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌…

Carona vire

కేంద్రం ఏం చెప్తోందంటే

కోవిడ్ సోకిన పిల్లల ఐసోలేషన్‌‌, ట్రీట్‌‌మెంట్‌‌, పోస్ట్ కోవిడ్ కేర్‌‌‌‌, హాస్పిటల్‌‌ ప్రిపరేషన్‌‌పై కేంద్ర ఆరోగ్య శాఖ‌ గైడ్‌‌లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రాలు లాక్డౌన్ను ఎత్తివేస్తుండ‌టం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం వల్ల పిల్లల్లో కరోనా కేసులు పెరగొచ్చని పేర్కొంది. ఫస్ట్ వేవ్‌‌, సెకండ్‌‌ వేవ్‌‌లో 88% పెద్దవాళ్లు, 12% మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారని.. థర్డ్ వేవ్‌‌లో ఈ లెక్కలో మార్పు రావొచ్చని తెలిపింది. తొలి రెండు వేవ్స్‌‌లో కోవిడ్ బారిన పడ్డ పిల్లల్లో 2% నుంచి 3% మంది మాత్రమే హాస్పిటళ్లలో చేరారని, థర్డ్‌‌ వేవ్‌‌లో ఇది 5% దాకా ఉండొచ్చని పేర్కొంది. ఇక, హాస్పిటళ్లలో చేరిన పిల్లల్లో  40% మందికి ఐసీయూ అవసరం పడొచ్చని చెబుతూ.. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

Read More: corona: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు వ‌స్తాయో తెలుసా?


పిల్లల్లో ల‌క్ష‌ణాలు ఇవి…

కోవిడ్ సోకిన పిల్లల్లో కనిపించే లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సమస్య, గొంతు నొప్పి, డయేరియా, వాంతులు, అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ లక్షణాల తీవ్రతను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజ్‌‌గా విభజించి, అవసరమైన హాస్పిటల్‌‌కు పంపించాలి. పిల్లలకు సింప్టమ్స్ వస్తే వెంటనే టెస్టు చేయించాలి. పిల్లలున్న ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా వస్తే, లక్షణాలు లేకున్నా పిల్లలకు టెస్ట్ చేపించాలి. పిల్లల్లో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పిల్లల తల్లిదండ్రులకు పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి పంపాలి. వెంటనే స్పందించేలా కాల్‌‌ సెంటర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు ఎమర్జన్సీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలి.పిల్లల కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఐవర్‌‌‌‌మెక్టిన్‌‌, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిపిరవిర్‌‌‌‌, డాక్సిసైక్లిన్‌‌, అజిత్రోమైసిన్‌‌ వాడొద్దని ఆదేశించింది. ఈ మందుల ప్రయోగాలు పిల్లలపై జరగలేదని, అందువల్ల వాటిని ఉపయోగించడం కరెక్ట్ కాదని పేర్కొంది.

author avatar
sridhar

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju