NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎంత డేంజ‌ర‌స్ అనేది మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు!

Corona: క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకుంటున్న త‌రుణంలో థ‌ర్డ్ వేవ్ వార్త‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలోనే ఇటు కేంద్ర ప్ర‌భుత్వం అటు ప్ర‌ధాన‌మంత్రి స్వ‌యంగా థ‌ర్డ్ వేవ్ గురించి హెచ్చ‌రించారు. థ‌ర్డ్ వేవ్ ప్ర‌పంచాన్ని తాకింద‌ని, భార‌త్‌లో దాని ప్ర‌భావం లేకుండా మ‌నం జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే వైర‌స్‌పై పోరాటం నీరుకారుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు కొవిడ్‌-19 ప్రొటోకాల్స్‌ను విధిగా అనుస‌రించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ పేర్కొన్నారు.

Read More: Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడో తెలిస్తే షాకే..ఎస్‌బీఐ ఏం చెప్తుందదంటే…

coronavirus second wave is due to modi
PM Modi

కేంద్రం ఏం చెప్తోందంటే..

దేశమంత‌టా మార్కెట్లలో ర‌ద్దీ, సిమ్లా, మ‌నాలి, ముస్సోరి వంటి హిల్ స్టేష‌న్ల‌లో ప‌ర్యాట‌కుల సంద‌డిని ప్ర‌స్తావిస్తూ క‌రోనా నిబంధ‌న‌లకు తిలోద‌కాలు ఇస్తే వైర‌స్‌పై ఇప్ప‌టివ‌ర‌కూ మ‌నం చేసిన పోరాటం వృధా అవుతుంద‌ని హెచ్చ‌రించింది. థ‌ర్డ్ వేవ్ గురించి తాము మాట్లాడుతుంటే ప్ర‌జ‌లు దాన్ని వాతావ‌ర‌ణ అప్‌డేట్‌గా తేలిక‌గా తీసుకుంటున్నార‌ని ల‌వ్ అగ‌ర్వాల్‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జులైలో వెలుగుచూస్తున్న మొత్తం కరోనా వైర‌స్ కేసుల్లో 73.4 శాతం కేసులు కేర‌ళ‌, మ‌హారాష్ట్ర , త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క నుంచే న‌మోద‌వుతున్నాయ‌ని చెప్పారు. దేశంలో 55 జిల్లాల్లో ఇప్ప‌టికీ పాజిటివిటీ రేటు ప‌ది శాతం పైగా ఉంద‌ని వివ‌రించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితి ఇంకా ఆందోళ‌న‌క‌రంగానే ఉంద‌ని తెలిపారు. అసోం, మిజోరాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్ స‌హా ప‌ది రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలు వెళ్లాయ‌ని అక్క‌డ క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై స్ధానిక అధికారుల‌తో వారు సంప్ర‌దింపులు జ‌రుపుతార‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Read More: Corona: క‌రోనా క‌ల‌క‌లం… ఓ గుడ్ న్యూస్ ఇంకో బ్యాడ్ న్యూస్‌

మోడీజీ ఏమంటున్నారంటే…
క‌రోనా సెకండ్ వేవ్‌లా థ‌ర్డ్ వేవ్ కూడా విజృంభించ‌కుండా నిలువ‌రించాలంటే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం కావాల‌ని ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతూ.. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌న్నారు. ప‌రిస్థితి చేయిదాట‌క ముందే మ‌నం మ‌హ‌మ్మారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని చెప్పారు.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju