NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona : క‌రోనా టైంలో మోడీ ఖాతాలో ఇంకో మ‌చ్చ‌

Corona : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి క‌రోనా టైంలో ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల ప‌ర్వం ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలో పెరుగుతున్న కేసులు, అదే స‌మ‌యంలో టీకాల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం విదేశీ టీకాలను తెప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఈ రెండు కంపెనీల‌పై మ‌న‌దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

Read More : Lock down: తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగింపు? 

అప్పుడలా … ఇప్పుడిలా

గతంలోనే భారత ప్రభుత్వానికి ఫైజర్ సంస్థ తను ఉత్పత్తి చేసిన క‌రోనా టీకాకు అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే మోడెర్నా సైతం సంప్ర‌దించింది. అయితే ఈ రెండు టీకాలు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేయ‌లేద‌ని నిపుణుల కమిటీ వాటిని తిరస్కరించాయి. అయితే, దేశంలో సెకండ్ వేవ్ ఇటీవ‌లి కాలంలో తీవ్రతరం కావడంతో విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం నిర్ణ‌యం మార్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, ఇతర దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్ లో 2,3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని ప్రకటన చేసింది. కానీ, ఇక్క‌డే భార‌త్‌కు షాక్ త‌గిలింది.

Read More: Corona: క‌రోనా క‌ల‌క‌లం.. కేసీఆర్ కు ఓ బ్యాడ్ న్యూస్

ఇప్పుడు ఆ సంస్థ‌లు షాక్ ఇస్తున్నాయి

భార‌త్ త‌న‌కున్న అవ‌స‌రం ప్ర‌కారం ఇప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకోగా…అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడం, ఇప్పటివరకు బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే మరో రెండేళ్లు పట్టనుండంతో భార‌త్ కు వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం సాధ్యం కాద‌ని ఆ కంపెనీలు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫైజర్, మోడెర్నాలకు భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఒకరకంగా భారత్ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాలి. అదే స‌మ‌యంలో విపక్షాలు ప్ర‌ధానిపై విరుచుకుప‌డేందుకు చాన్స్ దొరికింద‌ని భావించ‌వ‌చ్చు.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju