NewsOrbit
జాతీయం న్యూస్

Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధర తగ్గించిన సీరం ఇన్సిట్యూట్

Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధరను తగ్గిస్తున్నట్లు పూనెలోని సీరం ఇన్సిట్యూట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు మాత్రమే ధర తగ్గించినట్లు వెల్లడించారు. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా డోసు ధర రూ.400 లుగా నిర్ణయించగా దాన్ని రూ.300లకు తగ్గించారు. ప్రైవేటు ఆసుపత్రులకు, వ్యక్తులకు డోసు ధర రూ.600 లు నిర్ణయించారు. దానిలో ఏటువంటి మార్పు చేయలేదు. టీకా ఉత్పత్తిలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి డోసు ధర రూ.150 లుగా గతంలోనే నిర్ణయించారు.

Corona Vaccine serum institute decrease dose rate
Corona Vaccine serum institute decrease dose rate

ఇంతకు ముందు కేంద్రానికి డోసు ధర రూ.150 లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 లు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ధరలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. టీకా ధరల తగ్గింపునకు ఉత్పత్తికంపెనీలతో మాట్లాడాలని కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో సెరం ఇన్సిట్యూట్ కోవిషీల్డ్ టీకా డోసు ధరను రూ.100 లు తగ్గించింది. టీకా తగ్గింపు ధర నేటి నుండి అమలు అవుతుందని సంస్థ అధినేత పూనావాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ధర తగ్గింపు వల్ల ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదా అవ్వడమే కాకుండా మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మరో పక్క టీకా ధరలు వేరువేరుగా ఉండటంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా టీకా విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో తయారు అవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ప్రజల ధనంతోనే తయారు చేస్తున్నారనీ, కానీ అదే ప్రజలకు టీకాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మిత్రుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju