NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్

Corona Virus: కరోనా బాధితులకు ఊరటగా కేంద్రం కీలక ఆదేశాలు

Corona Virus: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. లక్షలాది కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. అయితే దగ్గు, జలుబు, తలనొప్పి లక్షణాలు ఉన్న వారు కోవిడ్ పరీక్షలు చేయించున్నా అ రిపోర్టు రావడానికి రెండు మూడు రోజులు సమయం పడుతోంది. దీంతో వారు ఎటువంటి ట్రీట్ మెంట్ తీసుకోకపోవడం వల్ల రిపోర్టు వచ్చే సమయానికి వారిలో వ్యాధి ముదురుతొంది. కొందరు కోవిడ్ కేంద్రాలకు, ఆసుపత్రులకు వెళ్లినా కరోనా పాజిటివ్ రిపోర్టు రాలేదన్న కారణంతో చేర్చుకుని ఆ విధమైన ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదు. దీంతో రిపోర్టు వచ్చే సమయానికి వీరి నుండి మరి కొందరికి సంక్రమించడంతో పాటు వీరి ఆరోగ్య పరిస్థితి విషమించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సలో కేంద్ర కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆర్ టీ పీసీఆర్ పరీక్ష పాజిటివ్ నివేదిక వస్తేనే కానీ చేర్చుకునేది లేదంటున్న ఆసుపత్రులకు కేేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చికిత్స ప్రారంభంలో జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది.

Coronavirus central new guidelines for corona patients treatment
Coronavirus central new guidelines for corona patients treatment

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ సంచాలకులు బలరాం బార్గవ, ఢిల్లీ ఎయిమ్స్ సంచాలకులు రణదీప్ గులేరియా తదితర ముఖ్యమైన వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ చికిత్సలో జాప్యం జరగకుండా త్వరితగతిన బాధితులకు వైద్యసేవలు ప్రారంభించడంపై ఈ సమావేశంలో చర్చించారు. కోవిడ్ బాధితుల చికిత్సలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను సవరిస్తూ సూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇక పై వైద్యనిపుణులు ఈ సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

Corona Virus: కొత్త మార్గదర్శకాలు ఇవే

  • ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షా ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలి
  • ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్న బాదితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. పరిస్థితి విషమిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి.
  • ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ అని రిపోర్టు వచ్చినా బాధితుల్లో లక్షణాలు కనిపిస్తుంటే కోవిడ్ గానే భావించి చికిత్స అందించాలి
  • ఇళ్ల వద్ద బాధితులకు చికిత్స అందిస్తున్నా జ్వరం తగ్గకుండా అలానే వస్తుంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నట్లుగా గుర్తిస్తే వారికి స్టెరాయిడ్ ఔషద చికిత్స అందించాలి.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!