జాతీయం

ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింక్ పై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు..!!

Share

ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింక్ పేరిట దందా కొనసాగుతున్నట్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింక్ అంటూ చట్టానికి విరుద్ధంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ కే చెందిన డాక్టర్ ఎం శివరంజని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఓఆర్ఎస్ విక్రయాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

court notices to central and state governments on ors energy drink
ORS

ఏప్రిల్ 8వ తారీకు కేంద్రం మరియు కేంద్ర ఆహార భద్రత ఇంకా ప్రమాణాల మండలి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవటాన్ని డాక్టర్ శివరంజని పిటిషన్ లో సవాల్ చేయడం జరిగింది. ఓఆర్ఎస్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్ అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. కానీ హాని కలిగించే ఎక్కువ షుగర్ ఇంకా ఎక్కువ ఉప్పు ఉండే పదార్థాలను జత చేర్చి.. రకరకాల బ్రాండ్ పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓఆర్ఎస్ వినియోగం వల్ల చాలా సందర్భాలలో హాస్పిటల్ లో జాయిన్ అయినా పరిస్థితులు కూడా ఉన్నాయని పిటిషనర్ తెలిపారు.

court notices to central and state governments on ors energy drink
ORS

ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన కఠిన చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కోర్టు.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని.. కౌంటర్ లు  దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ, కేంద్ర ఔషధ ప్రమాణా నియంత్రణ సంస్థ ఇంకా డ్రగ్స్ కంట్రోలర్ అదే రీతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డీజీపీలకు నోటీసులు జారీ చేసి అక్టోబర్ కు విచారణ వాయిదా వేయడం జరిగింది.


Share

Related posts

Google Maps: గూగుల్ మ్యాప్స్ కు ప్రత్యామ్నాయంగా దేశి యాప్?? నెటిజన్ల స్పందన ఇలా ఉంది!!

Naina

YS Jagan: జ‌గ‌న్ స‌ర్కారు తేల్చుకోలేక‌పోతున్న అంశం ఏంటంటే…

sridhar

China: చైనా నుంచి ఇంకో వైర‌స్ …ఇదేం ఖ‌ర్మ‌రా బాబు!

sridhar