NewsOrbit
జాతీయం న్యూస్

Covaxin: భారత్ బయోటెక్‌కు డబ్ల్యుహెచ్ఒ షాక్..! ‘కోవాగ్జిన్’ అనుమతులకు మళ్లీ బ్రేక్..! ఎందుకంటే..?

Covaxin:  కోవాగ్జిన్ కరోనా టీకా అత్యవసర వినియోగపు అనుమతుల కోసం భారత్ బయోటెక్ సంస్థ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) నుండి అనుమతులు వస్తేనే ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యుహెచ్ఓ ఆమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం  విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్ధులు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

Covaxin approval delay
Covaxin approval delay

 

Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ ..! ఈ నలుగురే నిందితులు..!!

Covaxin: కోవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతులు ఆలస్యం

భారత్ లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఎక్కువగా వినియోగించారు. ఎమర్జెన్సీ లిస్టింగ్ లో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యుహెచ్ఓ కొనుగోలు చేసి పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది. అయితే ఈయూఎల్ లో ప్రస్తుతం కోవాగ్జిన్ కు చోటు దక్కలేదు. దీని కోసం భారత్ బయోటెక్ యాజమాన్యం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది 19న తేదీన కోవాగ్జిన్ కు సంబంధించి పూర్తి క్లినికల్ డేటా, రీసెర్చ్ డాక్యుమెంట్లు, ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కు అందజేసింది.

 

నవంబర్ 3న డబ్ల్యుహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం భేటీ

కాగా కోవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా సంఘం మంగళవారం సమీక్ష నిర్వహించింది. సలహా సంఘం సంతృప్తి చెందితే 24 గంటల్లో అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందని తొలుత డబ్ల్యుహెచ్ఒ అధికార ప్రతినిధి మార్గరేట్ హారిస్ వెల్లడించారు. అయితే కోవాగ్జిన్ కు సంబంధించి భారత్ బయోటెక్ సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన డబ్ల్యుహెచ్ఓ ..సమాచారం అసమగ్రంగా ఉందని తెలిపింది. రిస్క్ – బెనిఫిట్ అసెస్‌మెంట్ కు సంబంధించిన సమాచారం మరింత కావాలని పేర్కొంది. కోవాగ్జిన్ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గానూ భారత్ బయోటెక్ నుండి అదనపు సమాచారం అవసరమని డబ్ల్యుహెచ్ఓ సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. కాగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతిపై తుది మదింపునకు గాను డబ్ల్యూహెచ్ఒ సాంకేతిక సలహా బృందం నవంబర్ 3వ తేదీన తిరిగి సమావేశం అవుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N