NewsOrbit
జాతీయం న్యూస్

Covid Vaccine: వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల కీలక ప్రకటన..! ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌యే..!!

Covid Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న వేళ కరోనా వ్యాక్సిన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి కంపెనీలు టీకాలను అందించలేక పోవడంతో టీకా కొరత ఆందోళన కల్గిస్తోంది. టీకా ఉత్పిత్తిని పెంచి దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించాలంటూ విపక్షాల నుండి కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కీలక ప్రకటన చేశాయి. రాబోయే నాలుగు నెలల్లో తమ ఉత్పత్తి సామర్థ్యాల పెంపుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి తెలియజేశాయి. తమ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో గణనీయంగా పెంచుతామని తెలిపాయి. పూణెలోని సీరం ఇన్సిట్యూట్ ఆగస్టు నాటికి తమ ఉత్పత్తిని పది కోట్ల డోసులకు పెంచుతామని తెలియజేయగా, భారత్ బయోటెక్ సంస్థ 7.8 కోట్లకు పెంచుతామని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరక ఈ సంస్థలు తమ ఉత్పత్తి అంచనా ప్రణాళికను కేంద్రానికి అందించాయి.

Covid Vaccine increase production capacity in coming months
Covid Vaccine increase production capacity in coming months

టీకా తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటామనీ, ఆగస్టు నాటికి తమ తయారీ సామర్థ్యాన్ని పది కోట్ల డోసులకు పెంచుతామనీ, సెప్టెంబర్ లో అదే స్థాయిలో కొనసాగిస్తామని సీరం ఇన్సిట్యూట్ వివరించింది. అదే విధంగా హైదరాబాద్ కు చెందిన బయోటెక్ కూడా తమ తయారీని జూల నాటికి 3.32 కోట్ల డోసులకు, ఆగస్టు నాటికి 7.82 కోట్ల డోసులకు, సెప్టెంబర్ లోనూ ఇదే స్థాయిలో పెంచుతామని తెలిపింది.

 

వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రానికి కేటాయించి మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రాలకు, ప్రైవేటు హాస్పటల్స్ కు విక్రయించుకోవచ్చని గతంలో కేంద్రం ఆమోదించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కంపెనీలకు ఇండెంట్‌లు పెట్టాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju