Cyclone Tauktae: మహమ్మారి ప్రభావిత రాష్ట్రాలపై తౌక్టే పంజాతో విలవిల

Share

Cyclone Tauktae: ఒక పక్క కోవిడ్ మహమ్మారి రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో తౌక్టే తుఫాను ముంచుకు రావడంతో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను నిన్న తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ప్రస్తుతం గంటకు 9 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ మరి కొద్ది గంటల్లో గుజరాత్ వద్ద తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా 50 ఎన్డీఆర్ఎఫ్ బందాలను సిద్ధం చేశారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలను తౌక్టే వణికిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, నావీ, పోలీసు బృందాలు ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Cyclone Tauktae hits Pandemic severity states
Cyclone Tauktae hits Pandemic severity states

తౌక్టే తుఫాను ప్రభావంతో తీవ్ర ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వర్షాల మూలంగా పలు ప్రధాన నదుల్లో వరద ప్రవాహం పొటెత్తింది. వందల సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. కర్ణాటకలో తుఫాను ధాటికి ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. తుఫాను కారణంగా మహారాష్ట్రలోని పూణె సమీపంలోని పలు గ్రామాల్లో 70 ఇళ్ల కూలిపోయాయి. తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్న గోవాలో ఇప్పటికే ఆసుపత్రులలో పడకలు, అక్సిజన్ కొరత తో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ముంచుకు వచ్చిన తౌక్టే తుఫాను ప్రభావానికి గోవా తీరం అల్లకల్లోలం అవుతోంది. తీరంలో సముద్రపు అలలు రెండు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుఫాను కారణంగా ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తుఫాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న పరిస్థితిని సమీక్షించారు. అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


Share

Related posts

 Nagarjuna : మనం 2 స్టోరీ ఇదే మొత్తం లీక్ అయ్యింది , అక్కినేని ఫ్యాన్స్ కి పండగే…! 

arun kanna

Reshma Pasupuleti Latest HD Photos

Gallery Desk

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు ఏమిటో తెలుసుకుందాం

Kumar