NewsOrbit
జాతీయం న్యూస్

Pegasus: పెగసెస్ పై కేంద్రం కీలక ప్రకటన..!!

Defence ministry parliament no transaction Pegasus maker

Pegasus: పెగసెస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుండి విపక్షాలు పెగసెస్ పై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కల్గిస్తున్నాయి. దీంతో   పెగసెస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్‌వో గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ నేడు రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.

Defence ministry parliament no transaction Pegasus maker
Defence ministry parliament no transaction Pegasus maker

ఎన్ఎస్‌వో గ్రూపు టెక్నాలజీతో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఒక వేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలంటూ సీపీఎం ఎంపి వి శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఎన్ఎస్‌వో గ్రూపుతో రక్షణ శాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాల ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్ నిఘా జాబితాలో భారత్ కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్ట్ లు, సీబీఐ అధికారులు, హక్కుల కార్యకర్తల ఫోన్ లు హ్యాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జూలై 18న ఈ కథనాలు వెలువడటంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో చర్చకు పట్టుబడుతూ ఆందోళనలు చేస్తున్నాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju