ఢిల్లీలో మంకీ పాక్స్ కలకలం …ట్విస్ట్ ఏమిటంటే..?

Share

దేశంలో మంకీ పాక్స్ కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తొంది. తాజాగా భారత్ లో నాల్గవ కేసు ఢిల్లీలో నమోదు అయ్యింది. ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కేరళలో ఇప్పటి వరకూ మూడు మంకీ పాక్స్ కేసులు నమోదైయ్యాయి. విదేశాల నుండి వచ్చిన ముగ్గురు మంకీ పాక్స్ సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ తాజాగా ఢిల్లీలో నమోదైన కేసులో ట్విస్ట్ ఏమిటంటే.. అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఎటువంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తికి మంకీ పాక్స్ సోకడం ఆందోళన కల్గిస్తొంది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు.. వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు నిర్వహించగా మంకీ పాక్స్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో  ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంది మంకీ పాక్స్ బారినపడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు వ్యాపించింది. మరో వైపు మంకీ పాక్స్ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించి వారికి ఆ లక్షణాలు కనబడితే వెంటనే ఐసోలేషన్ కు తరలించాలని సూచించింది. కరోనా తరహాలో మంకీ పాక్స్ ప్రపంచానికి ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

24 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago