దేశ రాజధాని ఢిల్లీ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమ్ అద్మీ పార్టీ (ఆప్) చైర్మన్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆప్, బీజేపీ నేతల రాసాభాస మధ్య ఇప్పటికే రెండు సార్లు మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. మరల ఎప్పుడు ఎన్నిక నిర్వహించే అంశంపై ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ (బీజేపీ) సరైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో నిర్ణీత గడువులోపు ఎన్నిక నిర్వహించేలా ప్రిసైడింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ షెల్లీ ఒబెరాయ్ సుప్రీం కోర్టును కోరారు. అంతే కాకుండా లెప్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లకు ఓటింగ్ అర్హత లేదనీ, వాళ్లను ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నిలువరించాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు షెల్లీ ఒబరాయ్. ఈ పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గత నెలలో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగ్గా ఆప్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్న మొత్తం 250 వార్డులకు గానూ 134 వార్డులను ఆప్ గెలుచుకోగా, బీజేపీ 104 వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 6వ తేదీన మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలు నిర్వహించాలని భావించగా, అనూహ్యంగా బీజేపీ .. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల బరిలో అభ్యర్ధులను ప్రకటించి ట్విస్ట్ ఇచ్చింది.

ఈ పరిణామంతో ఆ రోజు బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు, నిరసనలు హోరెత్తడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికను సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నించగా సేమ్ అదీ సీన్ రిపీట్ కావడంతో మళ్లీ ఎన్నికలు అగిపోయాయి. ఈ పరిణామాలతో మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం .. అభిమానులకు అభివాదం చేస్తూ..వీడియో వైరల్