మునావర్ షారుఖీకి ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన కామెడీ షోకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ధరఖాస్తు చేయగా ఈ ధరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. మునావర్ కామెడీ షోకు అనుమతి ఇవ్వవద్దంటూ విశ్వహింధూ పరిషత్ ఇప్పటికే పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించింది. షో కు అనుమతి ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని వీహెచ్ పీ నేతలు పోలీసులకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు .. చర్లపల్లి జైలుకు తరలింపు
ఇంతకు ముందు మునావర్ ఫారుఖీ కామెడీ షో కు బెంగళూరు సర్కార్ అనుమతి ఇవ్వలేదు. అయితే ఇటీవల హైదరాబాద్ లో పోలీసులు ఆయన కామెడీ షోకు అనుమతి ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు రెండు సార్లు అరెస్టు చేశారు. తొలుత నమోదు చేసిన కేసులో వెంటనే బెయిల్ పై బయటకు రాగా తర్వాత పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ పరిణామాల క్రమంలో ఢిల్లీ పోలీసులు మునావర్ కామెడీ షోకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. మునావర్ హిందూ దేవతలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన కామెడీ షోల నిర్వహణను వి హెచ్ పీ, బజరంగ్ దళ్ వండి హింధూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.
భారీ భద్రత నడుమ మునావర్ ఫారూఖీ కామిటీ షో విజయవంతం